DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు
Rajanikath, Atluri purnachadrarao, Dil Raju
నిర్మాత అంటే ఇచ్చేవాడు. అందరూ తీసుకునేవారు. తీసుకునేవారే ఇచ్చేవారిని శాసిస్తున్నారు. నిర్మాతకు వుండాల్సిన లక్షణాలు రామానాయుడు, కె.ఎస్. రామారావు ఇలా సీనియర్ నిర్మాతలనుంచి నేర్చుకున్నాను. నిర్మాత అనేవాడు ఎలా వుండాలో తెలుసుకున్నారు. మాకు దారి తీసిన నిర్మాతలు వారు. అదేవిధంగా 90 ఏళ్ళ అట్లూరి పూర్ణచంద్రరావుతో ఆయన పుట్టినరోజున ఓ మాట ఇస్తున్నాను.
ఆయన సమర్పణలో నేను నిర్మాతగా సినిమా నిర్మిస్తాను. ఇది ఆయనకు నేనిచ్చే గిఫ్ట్ అంటూ తెలిపారు. నేను తీసిన సినిమాను హిందీలో తీస్తాను. రైట్స్ కావాలి అని సారి పూర్ణచంద్రరావుగారు అడిగారు. మీరు తీస్తానంటే ఫ్రీగా ఇస్తానని చెప్పాను కూడా అని చెప్పారు.
ఈ సంఘటన కర్ణాటక కాశ్మీర్ కూర్గ్ లో గ్రీన్ పార్క్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభోత్సవంలో జరిగింది. ఇటీవలే చిన్న జీయర్ స్వామి, రజనీకాంత్ చేతుల మీదుగా ఆరంభమైంది. డెన్మార్క్ ఆర్కిటెక్చర్ ని తలపించే అద్భుతమైన ఇంటీరియర్స్తో 37విల్లాలు 54 రూమ్స్తో దాదాపు 35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ రిసార్టు ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావు గారు నిర్మించారు.
రజనీకాంత్ మాట్లాడుతూ, నన్ను అంధ కానున్ చిత్రంతో హిందీ సినిమాకు పరిచయం చేసిన వ్యక్తి అట్లూరి పూర్ణ చంద్రరావు గారే. అ తర్వాత కూడా నాతో కొన్ని సినిమాకి తీశారు. నికార్సైన మనిషి. చెప్పిందే చేస్తారు. అందుకే ఆయన పిలవగానే వచ్చి ఈ ఫంక్షన్లో పాల్గొన్నాను. ఆయన 90 ఏళ్ల వయసులో ఇలాంటి అద్భుతమైన రిసార్ట్ కట్టటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు ఆయన పుట్టినరోజు మరియు మహా శివరాత్రి వంటి గొప్ప పర్వదినం కావటం దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయటం చూస్తుంటే ఇంత కంటే గొప్ప విషయం ఏముంటుంది అని అనిపిస్తుంది అన్నారు. ఆయన 120 ఏళ్లు బతకాలి అని కోరుకుంటున్నాను అన్నారు..
ఇదిలా వుండగా, ఈ వేడుకలో దిల్ రాజు తన భార్యతో డాన్స్ లేస్తూ పూర్తి ఎంజాయ్ చేశారు. కాగా, అట్లూరి కాంబినేషన్లో రజనీకాంత్ తో సినిమా తీస్తాడేమో అని అక్కడికి హాజరయినవారికి అనిపించింది. అదంతా సస్పెన్స్.. త్వరలో ప్రకటిస్తానని అన్నారు.