మళ్లీ పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకోనున్నారు. జూలై 5వ తేదీన వీరి వివాహం ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరుగనుంది. తన ప్రియరులా గౌరీ స్ప్రాట్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
'జులై 5వ తేదీన నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. మా ఇంట్లోనే చిన్న వేడుకగా పెళ్లి చేసుకుంటున్నాం. ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, మిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారు. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. మా వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని దీవించండి' అని ఆమిర్ ఖాన్ కోరారు.
ఈ విషయం చెప్పిన అనంతరం అమీర్ ఖాన్ పక్కనే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి విషెస్ తెలిపారు. అమిర్ ఖాన్‌కు గతంలో రీనా దత్తా, కిరణ్ రావులతో వివాహం జరిగింది. ఆ తర్వాత వారు విడిపోయారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే.
