1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Bomb Threat To Trisha Krishnan's House In Chennai

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

trisha
ప్రముఖ హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నై తేనాంపేటలోని నివాసంలో త్రిష ఉంటున్నారు. ఈ ఇంట్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. 
 
తేనాంపేటలోని త్రిష ఇంటిలో బాంబు పెట్టినట్టు చెన్నై నగర పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్ నిపుణులు, పోలీస్ జాగిలాలతో నిశితంగా పరిశీలించారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పైగా, ఈ బెదిరింపు కేవలం ఒక తప్పుడు సమాచారం అని తేల్చారు. 
 
ఈ తప్పుడు బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు పంపారు వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
About Writer
PNR
తర్వాతి కథనం
Suma: రాజీవ్ ఐక్యూ వర్సెస్ సుమ జీబీ పేరుతో టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో సుమ, రాజీవ్