సంబంధిత వార్తలు
- ఒడియన్ మాల్, హైదరాబాద్‌లో కొత్త 8- స్క్రీన్ సినిమాను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్
- కూకట్‌పల్లిలో 9 స్క్రీన్ సినిమా ప్రారంభంతో హైదరాబాద్‌కు కొత్త వినోదం
- Manaswini: మనస్విని బాలబొమ్మల కొక్కోరోకో తో సినీ రంగ ప్రవేశం
- Raja Saab review : ద రాజాసాబ్ తో ప్రభాస్ అలరించాడా! లేదా! - ద రాజాసాబ్ రివ్యూ రిపోర్ట్
- PVR INOXలో 5 కొత్త స్క్రీన్లు, హైదరాబాద్ ఇన్ఆర్బిట్ మాల్లో 11- స్క్రీన్ సూపర్ ప్లెక్స్ ఆవిష్కరణ
కార్ డ్రైవర్ సెల్వం జీవిత కథగా కార్మేని సెల్వం, థియేట్రికల్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్
Samuthirakani, Gautham Vasudev Menon,
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రానికి అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరింది. దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో కార్మేని సెల్వం సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నారు. ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ మరియు జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా మారుతుంది.
ఈ చిత్రంపై దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ .. “కార్మేని సెల్వం ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం అని తెలిపారు.
నటీనటులు:సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు.
సాంకేతిక బృందం:
బ్యానర్: పాత్‌వే ప్రొడక్షన్స్
నిర్మాత: అరుణ్ రంగరాజులు
కథ – దర్శకత్వం: రామ్ చక్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీ శరవణన్
మ్యూజిక్: MAAS (Music as a Service), Musicloud Studio & Technology
డీఓపీ: యువరాజ్ దక్షన్
ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్
ప్రొడక్షన్ డిజైనర్: శంకర్
లిరిక్స్: మణి అముతవన్, ఉమా దేవి
ఆడియోగ్రఫీ: రాఘవ్ రమేష్
సౌండ్ డిజైన్: రాఘవ్ రమేష్ – హరి ప్రసాద్ MA
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: మణి దామోతథరన్
ప్రొడక్షన్ మేనేజర్: వీఆర్ రాంభరత్
మార్కెటింగ్: నాని కాంచనపల్లి - జయరాజ్ గేదెల
