ఆదివారం, 8 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 21 జనవరి 2026 (13:29 IST)

Chandrabose: ఉస్తాద్ భగత్ సింగ్ లో బ్యాక్ గ్రౌండ్ గీతాన్ని కసరత్తు చేస్తున్న చంద్రబోస్

Chandrabose wiriting a song
Chandrabose wiriting a song
ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ప్రఖ్యాత గీత రచయిత చంద్రబోస్ సంచలనాత్మక సాహిత్యం తో ఒక బ్లాక్‌బస్టర్ నేపథ్య గీతం సిద్ధంగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం ఆయన బ్యాక్ గ్రౌండ్ గీతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పాట మన పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ ప్రభావాన్ని నిర్వచిస్తూ, సన్నివేశపరంగా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే.
 
గతంలో గబ్బర్ సింగ్ చిత్రాన్ని తెరకెక్కించిన హరీష్ శంకర్ ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, ప్రజా నాయకుడిగా వుండడంతో దాన్ని బేస్ చేసుకుని సాహిత్యం వుండేలా చంద్రబోస్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే హరీశ్ శంకర్, చంద్రబోస్ తో కథలోని కీలక అంశాన్ని చెబుతున్న రాయమని అడిగారు. అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్న ఫొటోలను నేడు చంద్రబోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
 
ఇక ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు.పార్తీబన్ విలన్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. విడుదలతేదీ ఏప్రిల్ లో వుంటుంది. ముందుగా మార్చిలో అనుకున్నా ఆ సమయంలో రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా వుండడంతో ఏప్రిల్ 23న ఉస్తాద్ భగత్ సింగ్ వుండనున్నదని తెలుస్తోంది.