1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chennai Love Story' Movie Soars as a Chartbuster

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Kiran Abbavaram, Sri Gouri Priya
Kiran Abbavaram, Sri Gouri Priya
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
 
 
ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఆదరణతో ఛాట్ బస్టర్స్ గా మారుతున్నాయి. ఫస్ట్ సింగిల్ 'తొలి ప్రేమేం తోపు కాదే..' ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'వదలనే..' పాట కూడా ఇన్ స్టంట్ గా సక్సెస్ అయ్యింది. ఇలా రిలీజ్ చేసిన ప్రతి పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతూ "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ జర్నీ చేస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
 
About Writer
దేవీ
తర్వాతి కథనం
VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య