1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chiranjeevi's 158th film is currently in regular production.

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

Chiru 158 Opieng - cene celebrities
Chiru 158 Opieng - cene celebrities
 
చిరు158 చిత్రం ఇప్పటికే వరుస అప్డేట్స్‌తో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమం మరింత వైభవంగా మారింది. ఈ మెగా త్రయం వేదికను పంచుకోవడం అభిమానులకు కనులవిందు చేసింది. పవన్ కళ్యాణ్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.వి. వినాయక్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. బి. గోపాల్, కోదండరామి రెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లోహిత్ తన బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మ్యాసీవ్ స్కేల్, ఇంటెన్సిటీ తో నిండిన ఈ కథలో చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఆయన జిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో ఈ సినిమా కోసం ఆయన ఎంత అంకితభావంతో సిద్ధమవుతున్నారో స్పష్టం చేసింది.
 
ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ విజువల్స్‌ను అద్భుతంగా ఆవిష్కరించనున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాశ్ కొల్లా, ఎడిటర్‌గా ఆంటోని రూబెన్ పని చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఎడిషనల్ స్క్రీన్‌ప్లే రైటర్లుగా పనిచేస్తున్నారు. హిలేరియస్ రైటింగ్ తో పొందిన భాను-నందు ద్వయం ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ‘ది ఇండియా స్టోరి విడుదలకు సిద్ధం