ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2026 (10:30 IST)

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy  visited Vijay Deverakonda and Rashmika's house
Revanth Reddy visited Vijay Deverakonda and Rashmika's house
నూతన దంపతులు విజయ్ దేవరకొండ ,రష్మిక ల వివాహ అనంతరం వేడుక హైదరాబాద్ లో తాజ్ లో జరిగింది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హాజరయ్యారు. మార్చి 4న జరిగిన ఈ వేడుకలెో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపించలేదు. ఆయన బిజీగా వున్నందున రాలేకపోయినట్లు తెలుస్తోంది.
 
Revanth Reddy, Vijay Deverakonda, Rashmika, Govardhan Rao, Lakmee
Revanth Reddy, Vijay Deverakonda, Rashmika, Govardhan Rao, Lakmee
అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మార్చి 5న స్వయంగా విజయ్ దేవరకొండ నివాసాన్ని సందర్శించారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న దంపతులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
 
రిసెప్షన్ కార్యక్రమం సమయంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈరోజు ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.
 
ఈ సందర్భంగా నూతన దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు.