అనిల్ రావిపూడి ఆవిష్కరించిన కుకూన్స్ సినిమా పోస్టర్
Updated: Thu, 1 Oct 2026 (18:16 IST)
Cocoons team with Anil Ravipudi
జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కుకూన్స్". ఈ చిత్రాన్ని న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మహేశ్ గౌరి దర్శకత్వం వహిస్తున్నారు . యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే మంచి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు "కుకూన్స్" చిత్ర పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.
అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - "కుకూన్స్" సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ పోస్టర్ కొత్తగా ఉండి ఆకట్టుకుంది. డైరెక్టర్ మహేశ్ గౌరి సరికొత్త ఆలోచనలు ఈ పోస్టర్ లో తెలుస్తున్నాయి. టైటిల్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన వికాస్ గతంలో డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకు మెంటార్ గా పనిచేశారు. ఇప్పుడీ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జగన్, సాగర్, వికాస్ తో పాటు మిగతా "కుకూన్స్" టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు.
నటీనటులు - జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి, తదితరులు
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి