ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్
సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రంతో ప్రముఖ డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఓ ఐటెం సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం ధర్మస్థల నియోజకవర్గం.
ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. న్యాయం చేయరా దేవుడా.. అంటూ వర్మ డ్యాన్స్ నెంబర్‌తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ వారంలోనే ఈ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ధర్మస్థల నియోజకవర్గం చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్, సుమన్‌లతో పాటు యంగ్ హీరోస్ కూడా నటిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు లేని విధంగా.. డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. న్యాయం చేయరా దేవుడా.. లిరికల్ సాంగ్‌తో మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతున్నాం. ఈ సాంగ్‌లో శ్రష్టి వర్మ స్టెప్స్ అందరినీ కనువిందు చేయనున్నాయి. ఈ వారంలోనే సాంగ్‌ని రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు.
ఈ సినిమాలో సాయికుమార్, సుమన్, నటరాజ, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల , కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు నటించిన ఈ చిత్రానికి