శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 డిశెంబరు 2025 (19:07 IST)

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ustad bhagat singh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదలకు ముందే సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, ఓ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 'దేఖ్ లేంగే సాలా' అంటూ సాగే ఈ పాట శనివారం విడుదల చేయగా, ఇపుడు అది యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాటను రిలీజ్ చేసిన కేవలం 15 గంటల్లోనే ఏకంగా 25 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, సరికొత్త రికార్డును సృష్టించే దిశగా దూసుకెళుతోంది. ప్రస్తుతం యూట్యూబ్‍లో ట్రెండింగులో కొనసాగుతోంది. ఈ పాటను సంగీత ప్రియులు రిపీట్ మోడ్‌లో వింటున్నారు. 
 
శనివారం విడుదలైన కొన్ని గంటల్లోనే 13 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు. ఈ వేగంతో 24 గంటల్లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటల జాబితాలో సరికొత్త చర్చ మొదలైంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ దేఖ్ లేంగే సాలా పాట 28 మిలియన్ వ్యూస్ సాధించి పుష్ప మూవీలోని కిసిక్ పాట రికార్డును చెరిపేసింది.