Peddi Sales: ఇండియాలో పెద్ది ప్రీ-సేల్స్ 22 కోట్ల కు చేరిందా !
Peddi NA report
ఉత్తర అమెరికా ప్రీమియర్‌లలో $870,000 డాలర్లకు పైగా వసూలు కాగా, 28,000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు, విజయవాడలో జరిగిన ఒక ఉత్సాహభరితమైన కార్యక్రమంలో అభిమానులు 'పెద్ది పెద్ది' అని నినాదాలు చేయడంతో, భారతదేశంలో ప్రీ-సేల్స్ 22 కోట్ల రూపాయలకు చేరువయ్యాయి అని సోషల్ మీడియాలో రిపోర్ట్స్ వెలువడుతున్నాయి.
ఇప్పటికే పలు చోట్ల భారీ బుకింగ్స్ అంటూ నిర్మాణ సంస్థలు ప్రచారాన్ని సాగించాయి. రామ్ చరణ్ బాగా కష్టపడి సినిమా చేశాడు. ఈ సినిమా విడుదలకు ముందే థియేటర్లలో కొంత గందరగోళం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిటర్లు రెంటల్, పర్సెంటేజ్ విదానంపై చర్చలు జరిపి ఫిలింఛాంబర్ ముందు వుంచారు. ఇక రిలీజ్ తర్వాత ఎటువంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.
