సోమవారం, 19 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 9 డిశెంబరు 2025 (15:17 IST)

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Akhanda 2- Balakrishna
Akhanda 2- Balakrishna
నందమూరి బాలకృష్ణ చిత్రం ‘అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడి,   అవుతుందని ఫాన్స్ సోషల్ మీడియాలో చెప్పారు. నేడు కోర్ట్ క్లియర్ అవ్వగానే అన్ని చానల్స్  డిసెంబర్ 12న రిలీజ్ అని ప్రచారం చేస్తున్నాయి. అయితే డిసెంబర్ 12న దాదాపు 16 సినిమాలు చిన్నవి విడుదల కాబోతున్నాయి. దీనిపై ‘కలర్ ఫోటో’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న  డైరెక్టర్ సందీప్ రాజ్ తన ఆవేదన సోషల్ మీడియాలో తెలిపారు.
 
రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోగ్లీ’. ఈ సినిమాను పక్కా ప్లాన్ ప్రకారం డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. అయితే, ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఆయన తన ఆవేదన ఇలా తెలిపారు. నేడు ఒక నోట్ విడుదల చేశారు. “బహుశా కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలకు నేను కాకుండా వేరే డైరెక్టర్ ఉంటే బాగుండేదేమో. ఈ సినిమాలు ఎంతో ప్యాషన్ ఉన్న వాళ్ళు, సినిమా కోసం ఏదైనా చేసే వాళ్ళు కలిసి తీసినవి. కానీ అంతా బాగుంది అనుకున్న సమయానికి ఏదో ఒక బ్యాడ్ లక్ వెంటాడుతోంది” అని సందీప్ రాజ్ వాపోయారు.
 
ఆయన ఇంకాస్త ఎమోషనల్ అవుతూ.. “నా పేరు బిగ్ స్క్రీన్ మీద ‘డైరెక్టెడ్ బై సందీప్ రాజ్’ అని చూసుకోవాలనే నా కల రోజురోజుకూ కష్టమైపోతోంది. సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తోందని అనిపిస్తోంది. బహుశా ఆ బ్యాడ్ లక్ నేనేనేమో!” అని రాసుకొచ్చారు.
 
మరి అఖండ 2 పై నిర్మాతలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సాయంత్రానికి 14 రీల్స్ బేనర్ నుంచి కొత్త డేట్ విడుదల చేయనున్నారు.