1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Do you know what promise Megastar Chiranjeevi gave to Telangana exhibitors?

DilRaju: తెలంగాణా ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన హామీ ఏమిటో తెలుసా !

Megastar Chiranjeevi and Telangana exhibitors
Megastar Chiranjeevi and Telangana exhibitors
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిటర్లు తమ సమస్యలు చాలా వున్నాయంటూ మీడియా ముందుకు రావడం తెలిసిన విషయమే. ఆ తర్వాత నిర్మాతలు, పంపిణీదారులు కూడా తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఫైనల్ గా ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసి దాని ద్వారా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇదిలా వుండగా, ఈరోజు సాయంత్రం ఛాంబర్ లో అత్యవసర సమావేశం జరుగుతుందని మీడియాకు సమాచారం అందింది.
 
కాగా, ఈరోజు 3 గంటల తర్వాత తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, పంపిణీదారులు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన ఇంటిలో సమావేశమయ్యారు. దాదాపు గంటనప్నర పాటలు సాగిన సమావేశ వివారలను ఎగ్జిబిటర్, పంపిణీదారుడు, నిర్మాత దిల్ రాజు మీడియాకు తెలియజేస్తూ, ఈరోజు సమావేశానికి అల్లు అరవింద్, డి.సురేష్ బాబుతో పాటు పలువురు ఎగ్జిబిటర్లు చిరంజీవిగారిని కలిశాం. 
 
థియేటర్లలో పర్సెంటేజ్ విధానం గురించి చిరంజీవిగారికి వివరించాం. అన్నీ సానుకూలంగా విన్నారు. ఛాంబర్ కూడా ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక అవన్నీ పరిశీలించి ఎగ్జిబిటర్లు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫైనల్ జడ్జిమెంట్ రేపుకానీ ఎల్లుండి కానీ వుండవచ్చు. ఈరోజు చిరంజీవిగారితో జరిగిన సమావేశంతో మేమంతా చాలా సంతోషంగా వున్నాం అన్నారు.
 
మరో ఎగ్జిబిటర్ మాట్లాడుతూ, చిరంజీవిగారు మంచి స్పందన ఇచ్చారు. మా సమస్యలు చెప్పాం. సింగిల్ థియేటర్ల సమస్యలు ఇన్ని వున్నాయా? అని ఆశ్చర్యంగా అడిగారు. అందుకే మేం చెప్పింది గంటకు పైగా మాతో చర్చించారు. అయితే ఈ సమావేశంలో పెద్ది సినిమా గురించి అస్సలు చర్చే జరగలేదు. అని అన్నారు. 
 
చిరంజీవి ఇలా తెలియజేశారు.
విషయాలన్నీ  పూర్తిగా  విన్న  శ్రీ  చిరంజీవి పరిశ్రమ లో  భాగస్వాములయిన  అందరికీ  పూర్తి న్యాయం జరిగేలా వుండాలని , ఒక్క  సినిమా  గురించో  , ఒక్క  సెక్టార్  గురించో  ఈ  చర్చ కాదని, అందరికీ  ఆమోదయోగ్యంగా  వుండాలనే పరిశ్రమ  కొన్ని పద్దతులను  ఏర్పరుచుకుంది అన్నారు.   
తెలుగు  చిత్ర  పరిశ్రమ కి  హైయెస్ట్  బాడీ  తెలుగు  ఫిలిం  ఛాంబర్  ఆఫ్  కామర్స్  అన్న  విషయాన్ని  గుర్తు చేసి, ఆ  ఛాంబర్  తీసుకున్న  నిర్ణయానికి  కట్టుబడి  వుండటం అందరికీ  సముచితం  అన్నారు. ఒకసారి  అందరినీ  సంప్రదించి , పర్సెంటేజ్ మోడల్ మీద  ఒక  కమిటీని  ఏర్పాటు  చేస్తూ ఛాంబర్  ఒక  నిర్ణయాన్ని  తీసుకున్న  తర్వాత  దాన్ని  వ్యతిరేకిస్తూ  మీడియా  ముందు ఏ ఒక్కరూ అభిప్రాయాలు  వ్యక్తపరచటం తగదని అన్నారు. ఇలాంటి వాటివల్ల  ఇండస్ట్రీ ఒక్కటిగా  లేదన్న సందేశం  ఇవ్వకూడదని  అన్నారు. 
 
ఇంతకు  ముందు  వేసిన  వేరే  కమిటీ ల  పని  తీరు , ఫలితాల పట్ల  సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత   అసంతృప్తి , అపనమ్మకం  వుందన్న  విషయం  అర్ధం అయిందన్నారు. ఈ సారి  ఛాంబర్  ఏర్పాటు చేసిన  కమిటీ  అనుకున్న గడువులో  అంటే  జూన్  30 వ  తేదీ  వరకూ , అన్ని  విషయాలని పూర్తిగా  పరిశీలించి  ప్రొడ్యూసర్స్ , డిస్ట్రిబ్యూటర్ర్స్ , ఎక్సహిబిటర్స్ అందరికీ  న్యాయం  జరిగేలా  పర్సెంటేజ్ మోడల్ మీద  ప్రతిపాదనని  చేస్తుందని  తనకు  నమ్మకం వుందని,  ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు  పూర్తిచేసి  నివేదిక  ఇవ్వటానికి  తనవంతు కూడా పూర్తి  ప్రయత్నం   చేస్తానని   శ్రీ చిరంజీవి  హామీ  ఇచ్చారు.
 
శ్రీ  చిరంజీవి  సమయం వెచ్చించి  తమకున్న సమస్యలని , భయాలని,  ప్రస్తుతం  సింగిల్  స్క్రీన్స్  కి  వున్న  పరిస్థితులని అవగాహన  చేసుకుని  అందరికీ  న్యాయం  జరిగేలా  చూస్తానని  భరోసా  ఇవ్వటం పట్ల  సభ్యులందరూ పూర్తి సంతృప్తి  వ్యక్తం చేశారు . వారి  అసోసియేషన్స్ లో  వున్న  మిగతా  సభ్యులందరికి ఈ సమావేశం గురించి  తెలియచేసి  24 గంటలలో తమ ఆమోదాన్ని  తెలియచేస్తామని  తెలిపారు. 
 
ఈ  సమావేశంలో  TFCC  ప్రెసిడెంట్  శ్రీ  సురేష్  బాబు , శ్రీ  అల్లు  అరవింద్ , TFDC  చైర్మన్. శ్రీ  దిల్  రాజు , ప్రముఖ  నిర్మాతలు  శ్రీ  కే ఎల్ నారాయణ, శ్రీ  సునీల్  నారంగ్ ,  శ్రీ  భరత్  నారంగ్ , తెలంగాణ  ఫిలిం  ఛాంబర్ ప్రెసిడెంట్  శ్రీ  శేఖర్ ,  శ్రీ అనుపమ్ , శ్రీ  శ్రీధర్ , శ్రీ  సదానంద్  గౌడ్ , సుదర్శన్   థియేటర్ ప్రొప్రయిటర్ శ్రీ రాజ్   తదితరులు  పాల్గొన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్