కుక్కలు పోతాయ్, పిల్లులు పోతాయ్, కోతులు పోతాయ్, మనమూ పోతాం: రేణు దేశాయ్
సినీ నటి రేణు దేశాయ్ లైవ్ చిట్ చాట్లో మాట్లాడుతూ... ఎందుకండి అంత టెన్షన్. కుక్కలు పోతాయ్, పిల్లులు పోతాయ్, కోతులు పోతాయ్, చివరికి మనం కూడా పోతాము. ఆఖరికి మిగిలేది ఏంటో తెలుసా? చూసారు కదా ప్రభాస్ చిత్రం కల్కిని. ఆ సినిమాలో పరిస్థితి ఎలా వుందో అలాగే మిగులుతుంది. అందరం పోయేవాళ్లమే కదా. కాబట్టి ఎందుక అంత టెన్షన్, హాయిగా ప్రశాంతంగా జీవిస్తుంటే చాలు అంటూ చెప్పుకొచ్చారు.
నన్ను కాపడటానికి అమ్మానాన్నా అన్నయ్యా భర్తా ఎవ్వరూ లేరు
తనను కాపాడటానికి అమ్మానాన్న, అన్నయ్య, భర్త ఎవరూ లేరు. తాజా అంశంపై నా తప్పు లేకున్నా ఎంతో మంది విమర్శిస్తున్నారు అంటూ సినీ నటి రేణూ దేశాయ్ అన్నారు. వీధి కుక్కలను చంపేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఈ విషయంలో తనను కొందరు విమర్శిస్తున్నారని, ఎన్ని విమర్శలు వచ్చినా తాను మాత్రం పోరాటం ఆపనని మరోసారి స్పష్టం చేశారు. కాశీలో గంగనానదిలో బోటింగ్ చేస్తున్న వీడియోను రేణు షేర్ చేశారు.
నన్ను కాపాడటానికి అమ్మానాన్న, అన్నయ్య, భర్త ఎవరూ లేరు. తాజా అంశంపై నా తప్పు లేకున్నా ఎంతో మంది నన్ను విమర్శిస్తున్నారు. మీరు చేసే వ్యాఖ్యలపై తిరిగి స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధను చెబుతాను. ఆయన నా ప్రార్థనలు వింటాడన్న నమ్మకం నాకు ఉంది. నేను తరచూ కాశీకి ఎందుకు వెళ్తానో మీకు ఇపుడు అర్థమై ఉంటుంది అని అన్నారు.
ఇక వీధి కుక్కలను చంపడంపై తన పోరాటం గురించి రేణూ దేశాయ్ ఈ పోస్టులో రాసుకొచ్చారు. నేనెప్పుడూ నా వ్యక్తిగత హక్కుల కోసం పోరాడలేదు. కానీ, వీధి కుక్కల విషయంలో ఈ పోరాటం ఆపను. కొన్ని కుక్కలు చేసిన తప్పు వల్ల వందల సంఖ్యలో వాటిని చంపాలని నిర్ణయం సరైంది కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకునే వరకూ పోరాడుతూనే ఉంటాను అని స్పష్టం చేశారు.