1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Elage Pilla' romantic song from 'Anakapalli', unveiled by Naga Vamsi

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

Naga Vamsi,  Vikram Sahidev, Sandhya Vashishtha
Naga Vamsi, Vikram Sahidev, Sandhya Vashishtha
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన సినిమా అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ అయింది.  ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం. ఈ సినిమాకి కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు.
 
ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను, పాటల్ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.  తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘ఎలగే పిల్ల’ అనే పాటను రిలీజ్ చేసి, చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. పాట క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలో విజువల్స్, హీరో వేసిన స్టెప్పులు బాగున్నాయని చిత్రయూనిట్‌ను ప్రశంసించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని ఆయన కోరుకున్నారు.
 
ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. కపిల్ కపిలాన్, దేవజండ్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. కొరియోగ్రాఫీ కూడా చాలా అందంగా ఉంది. సింపుల్ స్టెప్పుల్ని హీరో విక్రమ్ సహిదేవ్ చాలా గ్రేస్‌తో వేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఇక రీల్స్‌లో ఈ హుక్ స్టెప్పులు ఎక్కువగా వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
 
ఇప్పటికే ‘అమ్మోరు దిగినాది’, ‘లబ్బరు బొమ్మ’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ లవ్ సాంగ్ కూడా ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.
 
*తారాగణం* : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు
About Writer
దేవీ
తర్వాతి కథనం
వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం