Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్
Purusha trailer
బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది అని వెన్నెల కిషోర్ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత వచ్చే సీన్లు, భార్యల చేతిలో భర్తలు నలిగిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ ఉన్న చోట నిజాయితీ ఉంటుంది.. నిజాయితీ లేని నీలాంటి వాడితో నేను ఉండలేను అని చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. పెళ్లాం తిట్టినప్పుడు మన లోపల ఉన్న మగాడు పవర్ ఫుల్‌గా బయటకు వస్తాడు అనే డైలాగ్స్ ఎంటర్టైనింగ్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ, యూత్, మాస్ ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ట్రైలర్‌ను కట్ చేశారు.
ఈ ట్రైలర్‌లో సతీష్ ముత్యాల కెమెరా వర్క్, శ్రవణ్ ఆర్ఆర్ అన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ఈ మూవీని మే 22న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సతీష్ ముత్యాల కెమెరామెన్‌గా, కోటి ఎడిటర్‌గా పని చేశారు.
నటీనటులు : పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ తదితరులు
