బుధవారం, 3 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 2 డిశెంబరు 2025 (19:12 IST)

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

GOAT team
GOAT team
జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ G.O.A.T . ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. 
 
ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమాని కూడా మేము చాలా బాధ్యతాయుతంగా తీసాము. మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చాయి గాని మళ్లీ రీవర్క్ చేసుకుని అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దాం. ముందున్న టీము మాకు అంతగా సపోర్ట్ చేయలేదు. తప్పని తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 
 
ఎవరో చేసిన తప్పులకి నిర్మాతగా నాలుగైదు రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టడం నేను తీసుకోలేకపోయాను. నాలుగైదు సార్లు వార్నింగ్ ఇచ్చే ఆ నిర్ణయం తీసుకున్నాను. నేను సినిమా అంటే ఫ్యాషన్ తోనే సినిమా చేశాను. నేను కథ విన్నప్పుడు ఒక ప్రేక్షకుడి లాగా వింటాను. మళ్లీ ఒక కొత్త టీం తో మేము అనుకున్న కథని అద్భుతంగా తీశాం. టీజర్ లో కామెడీ మాస్ యాక్షన్ మీరు చూశారు. ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేసే సినిమా. 
 
అలాగే సొసైటీలో ఉన్న ఒక సమస్యను కూడా ఇందులో అడ్రస్ చేశాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తారని నమ్మకం ఉంది. ఈ సినిమాని కళామతల్లి చేయించుకుంది. రవీంద్ర రెడ్డి  మాకు చాలా సపోర్ట్ చేశారు. మా హీరోయిన్ దివ్యభారతి ఈ సినిమా ఒప్పుకోడమే చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా తనకి తెలుగులో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. నితిన్ ప్రసన్న ఇందులో మెయిన్ విలన్ గా చేశారు. ఆయన మాకు దొరకడం గాడ్ గిఫ్ట్. లియన్ జేమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మణిశర్మ గారు పనిచేస్తున్నారు. ఆయన సపోర్టు మర్చిపోలేను. ఆయన లెజెండ్. ఈ కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమా చేస్తున్నానని చెప్పారు, పోస్ట్ ప్రొడక్షన్ అద్భుతంగా వచ్చింది త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. అందరికీ థాంక్యు