సోమవారం, 16 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 ఫిబ్రవరి 2026 (12:30 IST)

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

himanshi khurana
బాలీవుడ్ నటి, ప్రముఖ సింగర్ హిమాన్షీ ఖురానాకు వరుస బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని ఓ దండగుడు డిమాండ్ చేశాడు. దీనిపై హిమాన్షీ ఖురానా మొహాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాయిస్ మెసేజ్ నోట్ వచ్చిందని, అడిగింది ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
జీషన్ అక్తర్ అనే పేరుతో ఈ మెయిల్ వచ్చినట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పంజాబీ మూవీ సద్దా హక్‌‍ అనే మూవీతో హిమాన్షీ నటిగా మంచి గుర్తింపు పొందారు. అలాగే, నా.. నా.. నా.. వంటి ఆల్బమ్స్‌తో ఆలరించిన ఆమె హిందీ బిగ్ బాగ్ సీజన్-13లోనూ సందడి చేశారు. 
 
బాలీవుడ్‌ డైరెక్టర్‌ రోహిత్‌శెట్టి, హీరో రణ్‌వీర్‌సింగ్‌‌కు ఇటీవల బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తాను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్‌గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి వీరిద్దరికీ వాట్సప్‌లో వాయిస్‌ నోట్‌ పంపాడు. తన డిమాండ్‌లను అంగీకరించకపోతే.. వారి సిబ్బందిని హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.