సంబంధిత వార్తలు
- ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ
- Peddi Sales: ఇండియాలో పెద్ది ప్రీ-సేల్స్ 22 కోట్ల కు చేరిందా !
- Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్
- Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్
- Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రదర్శనలు
చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో
రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించి పెద్ది చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన ఈవెంట్లో మెగా అభిమాని పెద్దిలో చెర్రీ ఎలాగైతే జుట్టు పెంచుకుని పిలక వేసుకున్నాడో అచ్చం అలాగే జుట్టు ముడి వేసుకుని వచ్చాడు. ఈవెంట్ జరుగుతుండగా ఒక్కసారిగా రాంచరణ్ తో సెల్ఫీ కోసం అంటూ రివ్వుమంటూ చెర్రీ వైపుకి దూసుకువచ్చాడు.
ఇది గమనించిన రామ్ చరణ్ బాడీ గార్డ్ కెవిన్ ఒక్క ఉదుటున అతడిని పట్టేసాడు. ఆ సమయంలో అక్కడ కూర్చున్న జాన్వీ కపూర్ పైన కాస్త వుంటే మీద పడిపోయేవాడే ఆ అభిమాని. ఐతే బాడీగార్డ్ కెవిన్ అతడిని గట్టిగా పట్టుకుని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టాడు. జాన్వీ కపూర్ కి ఎలాంటి గాయాలు తగలలేదు. కాగా ఈవెంట్ పూర్తయ్యాక సదరు అభిమానిని రాంచరణ్ పిలిచి సెల్ఫీ ఫోటో ఇచ్చి పంపించేసాడు. ప్రస్తుతం ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Breaking
— Rolex (@Tfg85743663) June 2, 2026
Attack on Janhvi Kapoor meanwhile Ram Charan bodyguard just save them #KanganaRanaut #TheTatvaApp
aman gupta #Cocktail2
Rashmika and Kriti Sanon #ViratKohli pic.twitter.com/xBnZdMgaxC
