Fauji Update:: ఫౌజీ రీ షూటింగ్ లో పాల్గొన్న రెబల్ స్టార్ ప్రభాస్
Rebel Star Prabhas Enters Fauzi shoot
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న షౌజీ సినిమా షూటింగ్ ఇటీవలే బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలలో కూడా జాప్యం వుందని నిర్మాత మైత్రీమూవీస్ రవి తెలియజేశారు. కాగా, తాజాగా మరలా షౌజీ షెడ్యూల్ ప్రారంభమైంది. కొంత భాగం రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. హైదబాద్ లోని కోకాపేటలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ లో కొంత భాగం అటు హీరోకూ, నిర్మాతలకు నచ్చలేదని సన్నిహితులు పేర్కొంటున్నారు.
ఇంతకుముందు రామ్ లక్మణ్ ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో చేసిన యాక్షన్ సన్నివేశాలను తీసేసి కొత్త ఫైట్ చిత్రీకరణ చేస్తున్నారని తెలుస్తోంది. నిన్ననే ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ ఫొటోతో సహా పోస్టింగ్ వచ్చింది. బాహుబలి సినిమాకు పనిచేసిన సాల్మన్ రాజు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ ఫైట్ కథలో చాలా కీలకమైందనిగా భావిస్తున్నారు.
దేశాన్ని బ్రిటీషర్లు పాలించే కాలంలో దేవాలయంలో ప్రవేశించడానికి అక్కడి విగ్రహాలను ధ్వంసం చేయడానికి పాల్పడే సన్నివేశాలను ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో చిత్రించారు. కొంత భాగం కోకాపేటలో తీశారు. బ్రాహ్మణులకు, బ్రిటీషర్లకు మధ్య జరిగే పోరాటాలు సరికొత్తగా హాలీవుడ్ స్థాయిలో వుంటాయని చెబుతున్నారు. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
హనురాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కథా పరంగా ఇమాన్వి- ప్రభాస్ ల కెమిస్ట్రీ బాగా వచ్చింది. ఇమాన్వి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు ఎక్కువగా.. రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన అన్ని హీరోయిన్ క్యారెక్టర్స్ లో ది బెస్ట్ అవుతుంది. హను రాఘవపూడి ఈజ్ మై కెప్టెన్. మీరంతా ఓ మార్వెలస్.. మైండ్ బ్లోయింగ్..స్టోరీ టెల్లింగ్ ను చూడబోతున్నారు. ప్రభాస్ ట్రాన్స్ ఫార్మేషన్ ఆచారీ నుంచి అర్జున వరకు.. థియేటర్లలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని ఓ అభిమాని సామాజిక మాధ్యమాల్లో తెలిపాడు.ఇందులో ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్నాడని అర్థమవుతోంది.
