1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Filming begins for the second schedule of the cultural drama Dethadi, starring Ashish as the lead

Dethadi: ఆశిష్ హీరోగా కల్చరల్ డ్రామా దేత్తడి సెకండ్ షూటింగ్ ప్రారంభం

Dethadi  Second Schedule team
Dethadi Second Schedule team
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలలో నటించిన ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం  'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు.

ఇప్పటిటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. ఆశిష్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా షూటింగ్ కుముందు స్క్రిప్ట్ అంతా పూర్తయిన ఆనందంలో వున్న టీమ్ ఫొటోను షేర్ చేసింది. ఈ సినిమాలో హై ఎమోషన్‌తో పాటు కొత్తగా చూపించే కల్చరర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉండబోతోంది. ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్ జునైద్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు క్రియేటివ్ హెడ్‌గా కూడా పని చేస్తున్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Spirit : ప్రభాస్ చిత్రం స్పిరిట్ వాయిదా పడదంటూ స్టేట్ మెంట్