బుధవారం, 11 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (13:08 IST)

సినిమా పబ్లిసిటీ కోసం పచ్చిబూతులతో పాట, బరాబర్ ప్రేమిస్తా నటుడి నిర్వాకం

Chandrahas
మంచిమాటలతో చెబితే జనం పట్టించుకోరు అనుకుంటున్నారేమోగానీ ఇటీవలి కాలంలో పలు సినిమాల్లో ద్వంద్వార్థాలు, బూతులతో రెచ్చిపోతున్నారు. సినిమాల్లో సంగతి అలా వుంచితే ఇప్పుడు ఏకంగా చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లోనే బరాబర్ ప్రేమిస్తాలో నటించిన చంద్రహాస్ అనే నటుడు పచ్చిబూతులతో ఓ పాట పాడాడు. ఈ బూతుపాట సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
 
కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి జుగుప్సకరమైన భాషను వాడుతూ, జనం దృష్టిలో పడేందుకు చేస్తున్నారంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి దారుణమైన బూతులను ఏకంగా స్టేజిపైనే మాట్లాడుతూ, పాటలు కూడా పాడుతుంటే ఆ సినిమాలను మనం ప్రోత్సహించాలా... మీరే ఆలోచన చేయండి అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.