సంబంధిత వార్తలు
- Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్
- Suriya: త్రిషతో 23 ఏళ్ల తర్వాత డిఫరెంట్ కథతో వీరభద్రుడు చేశా : కథానాయకుడు సూర్య
- Suriya: వీరభద్రుడు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల
- Trisha: సూర్య, త్రిష జంటగా నటించిన వీరభద్రుడు సెన్సార్ పూర్తి
- Dhanush: కర సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది : హీరో ధనుష్
Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం
సూర్య ఫ్యామిలీ డ్రామా విశ్వనాథ్ & సన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భావోద్వేగాలు, హాస్యం, హృదయాన్ని తాకే కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది.
టీజర్, టైటిల్ ప్రకటన వెలువడినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చిన్నారితో కలిసి సూర్య కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆయన వింటేజ్ చార్మ్‌ను గుర్తు చేస్తూ కుటుంబ ప్రేక్షకులను తక్షణమే ఆకట్టుకున్నాయి.
సార్/వాథి, లక్కీ భాస్కర్ వంటి వరుస విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి, మరోసారి బలమైన కుటుంబ విలువలు, హృద్యమైన కథనం కలిగిన ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నారు.
ఈ చిత్రంలో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు.
విశ్వనాథ్ & సన్స్ ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన కుటుంబ వినోద చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
తమిళనాడులో ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ విడుదల చేయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
