గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 22 జనవరి 2026 (19:13 IST)

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్ర రాజం గొల్ల రామవ్వ

Mullapudi Vara,   P.V. Prabhakara Rao, MLC Surabhi Vani Dev
Mullapudi Vara, P.V. Prabhakara Rao, MLC Surabhi Vani Dev
తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన "గొల్ల రామవ్వ" తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని... ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ముఖ్య అతిధులు పేర్కొన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను...

సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ - వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై... రామ్ విశ్వాస్ హనూర్కర్ - రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. యువ ప్రతిభాశాలి అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు... సాహిత్యం సమకూర్చడం విశేషం.
 
ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం "మౌనమే నీ భాష" చిత్రాన్ని నిర్మించి, వీక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన టీమ్ నుంచి వస్తున్న "గొల్ల రామవ్వ" ఈనెల 25 (జనవరి 25) నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. "తెలుగు సీతామాలక్ష్మి" తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకలో పి.వి.నరసింహారావు తనయులు పి.వి.ప్రభాకరరావు, తనయ - బారాస ఎమ్.ఎల్.సి. శ్రీమతి సురభి వాణీదేవి, ప్రముఖ గీత రచయితలు కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, ప్రముఖ నటులు రాజీవ్ కనకాల, "రజాకార్" దర్శకులు యాటా సత్యనారాయణ, సీనియర్ దర్శకులు ఉదయభాస్కర్ పాల్గొని... చిత్ర దర్శకుడు ముళ్ళపూడి వరా, నిర్మాతలు రామ్ విశ్వాస్ హనూర్కార్, రాఘవేంద్రవర్మలను అభినందించారు.

మా నాన్నగారు రాసిన గొప్ప కథల్లో ఒకటైన "గొల్ల రామవ్వ"ను ఎంతో గొప్పగా తెరకెక్కించారని వాణీదేవి ప్రశంసించారు. చిత్రబృందం పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాలుపంచుకుని... ఈ సినిమాకి పనిచేసే అదృష్టం లభించడం పట్ల గర్వం వ్యక్తం చేశారు. ఈనెల 25 నుంచి ఈటీవీ విన్ లో ప్రసారం కానున్న ఈ చిత్రం తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం దక్కించుకుంటుందని పేర్కొన్నారు.
 
ఈ చిత్రానికి... పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, నటీనటులు : అల్లు గీత, అన్విత్, మణి మంతెన, గానం : వరం, సంగీతం: సాయి మధుకర్, ఛాయాగ్రహణం: గంగమోని శేఖర్, కూర్పు: రాఘవేంద్రవర్మ, రచన: బయ్యవరపు రవి, కార్యనిర్వాహక నిర్మాత - సాహిత్యం: అజహర్ షేక్, నిర్మాతలు: రామ్ విశ్వాస్ హనూర్కర్ - రాఘవేంద్రవర్మ (బుజ్జి), చిత్రనువాదం - దర్శకత్వం: ముళ్ళపూడి వరా.