1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Hero Arya talk about kollywood director Bala at Mr.X Telugu Pre Release event

గాడిదలా నటించాలని ఆ దర్శకుడు కోరితే ఏమాత్రం ఆలోచించను : హీరో ఆర్య

arya - bala
కోలీవుడ్ హీరో ఆర్య ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. తమిళ సినీ దర్శకుడు బాలా ఒక సినిమాలో గాడిదలా నటించాలని తనను కోరితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ పాత్ర చేస్తానని ఆర్య అన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం మిస్టర్ ఎక్స్. మను ఆనంద్ దర్శకుడు. తమిళం, తెలుగు భాషల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్య మాట్లాడారు. ఒకవేళ ఏదైనా సినిమాలో గాడిదలా నటించమని బాలా అడిగితే.. ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరిస్తానని తెలిపారు.
 
బాలా దర్శకత్వంలో తాను నటించిన 'నాన్‌ కడవుల్‌' అవకాశాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమా ప్రారంభానికి ఒక నెల ముందు.. అఘోరి లుక్ కోసం సిద్ధమవ్వాలని తప్ప మరేం చెప్పలేదని తెలిపారు. అలాగే పా.రంజిత్‌ కూడా కథ చెప్పకుండానే తనతో 'వెట్టువమ్‌' సినిమా చేస్తున్నారని చెప్పారు. 'ఒకవేళ నేను ఈ మూవీ స్టోరీ చెబితే.. నువ్వు చెయ్యవు. అందుకే నేను నీకు స్క్రిప్టు చెప్పలేదు' అని రంజిత్‌ చెప్పారంటూ ఆయనపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు ఆర్య.
 
'సార్పట్ట-2' షూటింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. బాక్సింగ్‌ నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆర్య తన శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారు. గతంలో విడుదలై విజయం అందుకున్న 'సార్పట్ట'కు ఇది సీక్వెల్‌. ఈ రెండింటికీ పా.రంజితే దర్శకుడు. ‘రాజా రాణి’లాంటి మరో రొమాంటిక్‌ కామెడీ మూవీలో నటిస్తున్నట్లు చెప్పారు. బాలా - ఆర్య కాంబో విషయానికొస్తే.. 'నాన్‌ కడవుల్‌' తర్వాత 'అవన్‌ ఇవన్‌' (వాడు వీడు), 'పరదేశి' చిత్రాలొచ్చాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Jetlee: సత్య, రితేష్ రానా కాంబినేషన్ చిత్రం జెట్లీ డేట్ ఫిక్స్