సంబంధిత వార్తలు
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్
- సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ
- Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు
- హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం
న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram
తన గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. తన మూవీస్ కు ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసిన టెక్నీషియన్‌ను దర్శకుడిగా అవకాశం కల్పిస్తున్నారు. నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఎమోషనల్ డ్రామాగా మంచి కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించనున్నారు. తను నడిచొచ్చిన దారిని మర్చిపోని కిరణ్ అబ్బవరం కెరీర్ ప్రారంభంలో తనతో పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్స్ నే తమ కొత్త మూవీస్ కు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొత్త వారితో సినిమాలు చేయాలనే గొప్ప లక్ష్యంతో కిరణ్ అబ్బవరం ముందడుగు వేస్తున్నారు.
ఈ మూవీ గురించి కిరణ్ అబ్బవరం స్పందిస్తూ - ప్రతి ప్రయాణం ఒక కలతో మొదలవుతుంది. ఆ కల నిజమవుతుందో లేదో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు తెలియదు. ఏడేళ్ల కింద ఒక పట్టుదల, డ్రీమ్ తో సినిమా పరిశ్రమలో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ఆదరణతో గుర్తింపు సంపాదించుకున్నాను. నాలాగే ఒక కలతో సినిమా పరిశ్రమకు వచ్చే యంగ్ టాలెంట్ కు మా కేఏ ప్రొడక్షన్స్ ద్వారా అవకాశాలు అందించాలని ప్రయత్నిస్తున్నాం. ఈ నెల 10న ఈ సినిమా అనౌన్స్ చేస్తున్నాం. నా జర్నీలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ. అన్నారు.
