ఇండియానా జోన్స్‌.. చిత్రాలంటే ఇష్టం : దగ్గుబాటి రానా

'ఇండియానా జోన్స్‌' లాంటి వార్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టమని టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పుడు నేనొక సినిమాల అభిమానిగా మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్‌

dv| Last Updated: శనివారం, 1 అక్టోబరు 2016 (11:54 IST)
'ఇండియానా జోన్స్‌' లాంటి వార్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టమని టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పుడు నేనొక సినిమాల అభిమానిగా మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్‌లో చాలా ఇంగ్లీష్‌ సినిమాలు చూసేవాడిని. 'ఇండియానా జోన్స్‌' లాంటి వార్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం ఉండేది.

ఆ సినిమాల తాలూకు బుక్స్‌ వంటివి ఎక్కువగా చదివేవాడిని. ఇండియన్‌ సినిమా ఇలా ఉంటదా? అని అనుకునేవాడిని. నేను రాజమౌళిని కలిసినప్పుడు ఒక మ్యాప్‌ చూపించారు. మహిష్మతి అనే రాజ్యం, ఆ రాజు వంటివన్నీ నాకు సవివరంగా చెప్పారు. అది వాళ్లు క్రియేట్‌ చేసిన ప్రపంచం. ఒక మహావక్షాన్ని వాళ్లు క్రియేట్‌ చేశారు. అందులో ఒక కొమ్మ సినిమా. టెలివిజన్‌ సీరీస్‌, కామిక్‌ బుక్స్‌, మెర్చండైజింగ్‌, వర్చువల్‌ థింగ్స్‌ వంటి విషయాల్లో వాళ్లు కేర్‌ తీసుకున్నారు.

ఫైనెస్ట్‌ వార్‌ ఫిల్మ్‌ ఇన్‌ ద కంట్రీని తెరకెక్కించడానికి వాళ్లు ఎంత కష్టపడ్డారో తెలిసిందే. చాలా సినిమాలకి ప్రమోషన్‌ తాలూకు టీ షర్ట్‌‌లు వంటివి చూస్తుంటాం. ఈ సినిమాకి విత్‌ లివ్‌ ఆఫ్టర్‌ ద రిలీజ్‌ ఆఫ్‌ బాహుబలి. చాలా క్వాలిటీగా చేశారు. యామజాన్‌ ప్రైమ్‌ నుంచి మా టీజర్‌ను అక్టోబర్‌ 1న విడుదల చేయనున్నాం. గ్రాఫిక్‌ చేశారు. వరల్డ్‌ క్లాస్‌ యానిమేషన్‌ చూస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పారు.దీనిపై మరింత చదవండి :