మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి
ప్రస్తుతం ప్రేక్షకుల మూడ్, ట్రెండ్ మారిపోయిందని, హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్‌గా ఉందని ప్రముఖ హీరో రానా దగ్గుబాటి అన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మారుతున్న ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని వివరిస్తూ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఒక కీలకమైన విషయాన్ని ఎత్తిచూపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, నేటితరం ప్రేక్షకులు ఇపుడు కేవలం హీరోలను చూసి కాకుండా, దర్శకుడి బ్రాండ్‌ను బట్టి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమా ప్రేమికులు ప్రస్తుతం ఒక రాజమౌళి సినిమా, ఒక నాగ్ అశ్విన్ సినిమా, ఒక సందీప్ రెడ్డి వంగా సినిమా లేదా ఒక ప్రశాంత్ నీల్ సినిమాను చూడటానికే అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారని రానా చెప్పారు. స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్, దర్శకుడి మేకింగ్ స్టైల్‌కు ఇండస్ట్రీలో లభిస్తున్న గౌరవానికి రానా చేసిన ఈ వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి.
