ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 5 మార్చి 2026 (18:44 IST)

Sharva: హీరో శర్వా... బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్‌లలో రిలీజ్

Sharva, Malavika Nair
Sharva, Malavika Nair
కథానాయకుడు శర్వా అడ్రెనలిన్‌ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బైకర్, భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిUV క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
 
మేకర్స్ ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో కూడా విడుదల కానుంది. దీంతో ప్రేక్షకులకు మరింత ఇమర్సివ్ థియేట్రికల్ అనుభూతి అందించనుంది.
 
హార్ట్-పౌండింగ్ రేసింగ్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.  పోస్ట్ ప్రొడక్షన్ దశలో విజువల్స్, సౌండ్ డిజైన్, హై-ఆక్టేన్ యాక్షన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి బైక్ రోర్, ప్రతి ఎమోషనల్ సన్నివేశం థియేటర్‌లో మరింత ప్రభావం చూపేలా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ టీజర్లు సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బలంగా ఉంది.
 
ఈ చిత్రంలో శర్వానంద్  డేరింగ్ ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  సీనియర్ హీరో రాజశేఖర్ “బుల్లెట్ సునీల్” అనే ఎక్స్ మోటోక్రాస్ లెజెండ్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటిస్తున్నారు.
 
సినిమాటోగ్రఫీని జె. యువరాజ్ అందిస్తుండగా, సంగీతాన్ని జిబ్రాన్ సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ అనిల్ కుమార్ పి నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను రాజీవన్ రూపొందిస్తున్నారు.
 
భారీ యాక్షన్, ఎమోషన్స్, టాప్ టెక్నికల్ టీమ్‌తో రూపొందిన “బైకర్” ఈ సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ థియేట్రికల్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.
 నటీనటులు:  శర్వా, మాళవిక నాయర్, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి  
 
సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర,  నిర్మాతలు: వంశీ-ప్రమోద్, సమర్పణ: విక్రమ్,  సంగీతం: జిబ్రాన్
DOP: J యువరాజ్