మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 జనవరి 2016 (14:56 IST)

దేవీశ్రీప్రసాద్‌కు హీరోయిన్‌గా సమంత.. ఛార్మీ లేనట్టేనా..?

దేవీశ్రీప్రసాద్‌ హీరోగా కొత్త సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దేవీశ్రీ ప్రసాద్ లవర్‌గా చెప్పుకుంటున్న అందాల రాశి ఛార్మి హీరోయిన్‌గా నటించనుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఛార్మీకి ప్రస్తుతం హిట్ హిస్టరీ లేకపోవడంతో దేవీశ్రీ తొలి సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇవ్వకూడదని సినీ యూనిట్ భావించినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. 
 
ఈ నేపథ్యంలో క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను తీసుకుంటేనే సినిమా హిట్ అవుతుందని.. అందుకే సమంతను కథానాయికగా సెలక్ట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంత నితిన్ హీరోగా అ..ఆ..., మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో దేవీశ్రీ ప్రసాద్ సరసన సమంత నటించేందుకు ఓకే చెప్తుందా లేదా అనేది తెలియాల్సి వుంది. రత్నవేలు కెమెరా, దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.