1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Hey Chikita song from Badri was a huge hit that's like This movie will also hit : Ali

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Ch.Srinivasa Rao, Ali, Abhinav Manikanta, Divija Prabhakar and others
Ch.Srinivasa Rao, Ali, Abhinav Manikanta, Divija Prabhakar and others
అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన హే చికీతా’ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, కమెడియన్ అలీ, వీఎన్ ఆదిత్య, ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ .. ‘‘పల్లెటూరులో చాలా ప్రేమ కథలుంటాయి. ‘హే చికీతా’ పోస్టర్‌ని చూస్తే మా ఊర్లో ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయి. రైతు పంట పండిస్తేనే మనం ఇలా జీవిస్తున్నాం. రైతే రాజు అనే కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రం మంచి విజయం దక్కాలి’ అని అన్నారు.
 
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘హే చికీతా’ టీంని చూస్తే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గానీ నిర్మాతగానో, ఆర్టిస్టుగానో, టెక్నీషియన్ గానో ఇండస్ట్రీలోకి రాలేం. ‘హే చికీతా’ విషయంలో ఆర్టిస్టులు అంతా బాగా నటించారు. అంజి కెమెరా వర్క్ బాగుంది. దర్శకుడు, నిర్మాత ఇలా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాతో హిట్ కొడితే వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదు అన్నారు.
 
కమెడియన్ అలీ మాట్లాడుతూ .. ‘‘బద్రి’ సినిమాలోని ‘హే చికీతా’ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓ చిత్రాన్ని తీయడం, రిలీజ్ చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలో విషయం ఉంటే.. ప్రేక్షక దేవుళ్లే నెత్తిన పెట్టుకుని మోస్తారు. భవిష్యత్తులో రైతు అనేవాడు ఉంటాడా? కనిపిస్తాడా? అని అనిపిస్తుంది. రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది. రైతు మీద, యువత మీద తీసిన ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలి. ‘హే చికీతా’ టీంకి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, ‘హే చికీతా’ మంచి విజయం సాధించాలి. ఇందులో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలి. చరణ్ అర్జున్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. అంజితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. ధన్ రాజ్ లెక్కలకు దర్శకుడిగా మంచి పేరు రావాలి’ అని అన్నారు.
 
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ,  ‘హే చికీతా’ మంచి హిట్ అవుతుంది. అంజి మంచి మూవీని నిర్మించారు. కెమెరామెన్‌గా, నిర్మాతగా అంజి గొప్ప సినిమాని తీశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
గరుడవేగ అంజి మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీని జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుసుకుందాం. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
 
నిర్మాతఎన్. అశోక ఆర్ఎన్ఎస్ మాట్లాడుతూ, ధన్ రాజ్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. అంజి గారితో కలిసి సినిమాని చేయడం ఆనందంగా ఉంది. చరణ్ అర్జున్ గారి పాటలు అద్బుతంగా ఉన్నాయి. జూలై 24న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ, అభినవ్, దివిజ, తన్మయ్, దేవి ప్రసాద్ గారు నాకెంతో సపోర్ట్ చేశారు. చరణ్ అర్జున్ అన్న వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను. మా సినిమాకి మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
అభినవ్ మణికంఠ మాట్లాడుతూ .. ‘చరణ్ అర్జున్ అన్న వల్లే నాకు ‘హే చికీతా’లో అవకాశం వచ్చింది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ధన్ రాజ్ అన్నకి, అంజి అన్నకి, అశోక అన్నకి థాంక్స్. దివిజ, తన్మయ్‌లతో నటించడం ఆనందంగా ఉంది. జూలై 24న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్