సంబంధిత వార్తలు
- సినిమాల్లో నటించాలనే ఆశతో భాగ్యనగరికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు... (వీడియో)
- వరకట్నం వేధింపులు... సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న టెక్కీ
- Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్
- King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్
- NTR: ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ లో నటించడంలేదంటున్న టోవినో థామస్
ఆ డ్రగ్ పార్టీలో నేనూ ఉన్నాను.. డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది : నటి హేమ
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని కొండాపూర్‌లో క్వాక్ ఏరియా పబ్‌పై నగర పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా ఆకస్మిక సోదాలు చేశారు. ఈ తనిఖీలు పబ్‌లో ఉన్నవారందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. పబ్ పార్టీ జరుగుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అనుమానం ఉన్న సుమారు 64 మందికి అక్కడికక్కడే డ్రగ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఈ పరీక్షల్లో ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ అయింది. వీరిలో ఆరుగురు గంజాయి సేవించగా, మరో ఇద్దరు ఇతర రకాల డ్రగ్స్ సేవించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఈ పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పబ్‌పై దాడి జరిగిన సమయంలో ఆమె అక్కడ ఉండటంతో రకరకాలైన ప్రచారాలు జరిగాయి. దీనిపై ఆమె తక్షణమే స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. నాకు నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. నేను ఏ తప్పూ చేయలేదు. దయచేసి నాపై అనవసరంగా దుష్ప్రచారం చేయొద్దు అని ఆ వీడియోలో పేర్కొన్నారు.
