Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు
Manchu Vishnu
ఇది జరిగాక తాజాగా రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ అంశంపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, సినీ నటుడు మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం మొదలైంది. సినిమా హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు విష్ణు తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జడ్చర్లలో డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దానికి మా' మాజీ అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్ వేదికగా స్పందించారు.. "ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు రాజకీయ నాయకులు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో నేను ఆలోచిస్తున్నాను. ప్రజా ప్రతినిధులు కూడా పారదర్శకంగా ఉంటే ఓటర్లు సంతోషిస్తారని నేను భావిస్తున్నాను" అని విష్ణు తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం హీరోలు వర్సెస్ రాజకీయ నాయకులుగా మారింది.
