Lavanya Tripathi: నేను గర్భవతిని. మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశా : లావణ్య త్రిపాఠి కొణిదెల
Lavanya Tripathi
లావణ్య త్రిపాఠి కొణిదెల మాట్లాడుతూ* .. సతీ లీలావతిని ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ చేయగలిగాను. సప్తగిరి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అందరూ గొప్ప ఆర్టిస్టులు నటించారు. దేవ్ మోహన్ గారి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాని మార్చి 6న చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
*దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ* .. కమల్ హాసన్ గారు చేసిన సతీ లీలావతితో మాత్రం నా సినిమాని పోల్చను. అందరూ రిలీట్ అయ్యేలా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తీశాం. మార్చి 6న మా మూవీని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.
*నిర్మాత నాగ మోహన్ మాట్లాడుతూ* .. నిర్మాతగా నాకు సతీ లీలావతి మొదటి చిత్రం. ఈ సినిమా ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నాను. మార్చి 6న మా మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రానికి మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
*నటుడు సప్తగిరి మాట్లాడుతూ* .. పాత సతీ లీలావతి ఎంత పెద్ద హిట్ అయిందో మా ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతకు ఇదే మొదటి చిత్రం. సత్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. మార్చి 6న ఈ మూవీని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది అని అన్నారు.
