సోమవారం, 16 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 ఫిబ్రవరి 2026 (20:40 IST)

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

Manchu Lakshmi
ఐదు సంవత్సరాల క్రితం తీసిన ఓ సినిమా తాలూకు అయిన అప్పులను ఇప్పటికీ కడుతూనే వున్నాను అని అన్నారు నటి, నిర్మాత మంచు లక్ష్మి. ఆమె ఇంకా మాట్లాడుతూ... ఇప్పుడిక నేను చిత్రాలను నిర్మించే రోజులు అయిపోయాయి. నేను కేవలం నటించడం వరకే.
 
అందుకే ఎవరైనా నా దగ్గరకు కథ చెప్పేందుకు వస్తే... నిర్మాతను చూసుకున్నారా అని అడుగుతున్నాను. బూకీ చిత్రం ఈ నెల 20న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పై విషయాలను ఆమె వెల్లడించారు. కాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో మంచు లక్ష్మి, అజయ్ దిషాన్, ఆర్‌కె ధనుష నటిస్తున్నారు. దర్శకత్వం గణేష్ చంద్ర వహించారు. నిర్మాణం విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్. విశేషం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్ వివాదాల నేపథ్యంలో పూకీ (Pookie) నుండి బూకీగా మార్చబడింది.