1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. I believe that God is behind me: Sharwa

Sharwa: నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను : శర్వా

Sharwa,  Rajasekhar, Malavika Nair, Abhilashreddy
Sharwa, Rajasekhar, Malavika Nair, Abhilashreddy
మొదటి నుంచే బైకర్ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని చెబుతున్నాను. ఆ మాట తప్పలేదు. అలాంటి మంచి ఫ్యామిలీ సినిమాను తీశాం. సినిమా అద్భుతంగా మౌత్ టాక్‌తో వెళ్తోంది. దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్, యూత్. అభిలాష్ మంచి ఫాదర్ అండ్ సన్ స్టోరీ చెప్పాడు. ఇది చాలా ఎమోషనల్ మూవీ అని కథానాయకుడు శర్వా తెలిపారు.
 
ఆయన నటించిన బైకర్ సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర టీమ్  థాంక్ యూ మీట్ ని నిర్వహించారు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందింది.
 
హీరో శర్వా మాట్లాడుతూ, నిజ జీవితంలో తండ్రి, కొడుకులు అలానే ఉంటారు. రాజశేఖర్ గారు మాకు ఎప్పుడూ హీరోనే. ఆయన ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ అందరికీ థాంక్యూ. మా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. అలాగే మా డీవోపీ, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ అందరూ అద్భుతంగా చేశారు. రేసింగ్ సీన్స్ ఇంత అద్భుతంగా వచ్చాయంటే, అది మొత్తం టీమ్ ఎఫర్ట్. టెక్నికల్‌గా సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసలు రావడానికి మా టీమ్ వర్క్ కారణం. ఇది నా బెస్ట్. ఇంత అద్భుతమైన సినిమాను అందించిన యువీ క్రియేషన్స్‌కు ధన్యవాదాలు. మేము చేసిన నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్లే. నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. ఈ ఏడాది నాకు రెండు హిట్లు ఇచ్చాడు. ప్రేక్షకులకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్.
 
డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, నా క్యారెక్టర్‌కు మంచి పేరు రావడానికి కారణం అభిలాష్ రెడ్డి గారు. మొత్తం టీమ్ కు  మంచి పేరు తీసుకొచ్చారు. శర్వా గారికి  థాంక్స్ చెబుతున్నాను. ఆయన హీరోగా చేస్తున్న సినిమాలో నేను ఇంత మంచి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే శర్వా గారు, మాళవిక ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా అద్భుతంగా నటించారు. సినిమా ఇంకా చూడని వాళ్లు థియేటర్‌కి వెళ్లి చూడండి. పేరెంట్స్‌ను కూడా తీసుకెళ్లండి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. అందరికీ థాంక్యూ సో మచ్.
 
డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ,  సినిమాలో రేసింగ్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతున్నారు. ఫాదర్ అండ్ సన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. చిన్న చిన్న పిల్లలు కూడా సినిమాను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇది చాలా లాంగ్ రన్ ఉండే సినిమా. ఈ సమ్మర్ అంతా బైకర్ దే.  మా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అన్నారు.
తర్వాతి కథనం
Vijay: జననాయగన్ లీక్ నాకు కోపం తెప్పిస్తోంది : విజయ్ దేవరకొండ