ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 16 మార్చి 2026 (16:19 IST)

Priyadarshi: సుయోధన క్యారెక్టర్ సాయికుమార్ గారినే అనుకున్నా : వై ఎస్ మాధవ్ రెడ్డి

Priyadarshi, Sai Kumar, Drishika Chander and others
Priyadarshi, Sai Kumar, Drishika Chander and others
ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం "సుయోధన". వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ "సుయోధన" సినిమాను విడుదల చేస్తోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో సాయికుమార్ మాట్లాడుతూ, ఈ సినిమాలో. నెక్ట్స్ ఏంటి అనే క్యూరియాసిటీ కలిగింది. మీలాగే మేము కూడా థియేటర్ లో ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నాం. మా టీమ్ లో మూవీ చూసి వచ్చిన వాళ్లను అడుగుతున్నాం ఎలా అనిపించింది అని. ఈ మూవీని డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. నేను ప్రియదర్శితో కలిసి కోర్ట్ సినిమా చేశాను. అది సూపర్ హిట్ అయ్యింది, గద్దర్ అవార్డ్ కూడా పొందింది. ప్రియదర్శి నాకు బిడ్డ లాంటివాడు. ఈ జనరేషన్ లో దర్శి లాంటి మంచి నటులతో కలిసి నేను వర్క్ చేయడం సంతోషంగా ఉంది. నేను ప్రేమ కన్నడలో చాలా సూపర్ హిట్ సినిమాల్లో జంటగా నటించాం. ఈ సినిమాలో ఆమె ఒక కీ రోల్ చేస్తోంది. సుయోదన సినిమా మంచి విజయం సాధించాలి. ఈ టీమ్ అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ - ఛోటా కె ప్రసాద్ అన్న ఈ కథ నా దగ్గరకు పంపారు. స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఒక మనిషి సుయోధన, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ బోసుబాబు గారు పెద్ద బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి రాలేదు. కేవలం తన ప్యాషన్ తో ఈ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఆయన ఒక రైటర్. సాంగ్స్ బాగా రాస్తారు. సినిమా మీద ఆయనకున్న ఇష్టం నన్ను బాగా ఇన్స్ పైర్ చేసింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ కథలో ఉన్న సుయోధన క్యారెక్టర్ కోసం మేమంతా ఏకగ్రీవంగా అనుకున్న పేరు సాయికుమార్ గారు. 50 ఏళ్లుగా సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్న కుటుంబం వారిది. సాయికుమార్ గారు తన గొప్ప టాలెంట్ ను మాలాంటి ముందు జనరేషన్స్ కు ఇవ్వడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డితో కలిసి పనిచేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ద్రిషిక హైదరాబాద్ అమ్మాయి. ఈ మూవీలో చాలా బాగా నటించింది. ఈ నెల 27న సుయోధన మూవీ చూడండి. మీరు బాగా ఎంటర్ టైన్ అవుతారు. అన్నారు.
 
డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ,  నాకు గతంలో ఎలాంటి ఎక్సిపీరియన్స్ లేదు. అయినా నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు మా ప్రొడ్యూసర్ బోసుబాబు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఈ కథ అనుకున్నాక, ప్రియదర్శి గారిని కలిశాను. ఆయన ఈ మూవీ చేస్తే బాగుంటుందని అనిపించింది. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన ఓకే చెప్పారు. ప్రియదర్శి మూవీ ఓకే చేయడంతోనే నాకు స్క్రిప్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సుయోధన క్యారెక్టర్ ఫస్ట్ నుంచీ సాయికుమార్ గారినే అనుకున్నాను. ఛోటా కె ప్రసాద్ గారు నాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. నాలాంటి డెబ్యూ డైరెక్టర్ కు ఛోటా అన్న బెస్ట్ ఎడిటర్. "సుయోధన" మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
 
యాక్టర్ దేవిప్రసాద్ మాట్లాడుతూ - "సుయోధన" సినిమాను స్క్రీన్ మీద చూడాలని మేమూ వెయిట్ చేస్తున్నాం. ఇందులో ఒక కొత్త తరహా కంటెంట్ ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిది. నేను ప్రియదర్శితో ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేస్తున్నా. సాయికుమార్ గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచీ మంచి పరిచయం ఉంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమా ఉంటుంది. అన్నారు.