1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. I feel very proud to present the film Itlu Arjuna: Nagarjuna

Nag: ఇట్లు అర్జున సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది : నాగార్జున

Nagarjuna, Anish, Anaswara Rajan
Nagarjuna, Anish, Anaswara Rajan
డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. తమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బిగ్ రివిల్ చేశారు. కింగ్ నాగార్జున సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు గ్రాండ్ గా రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 
 
నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొత్త టాలెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా వై.వి.ఎస్. చౌదరితో ఒక సినిమా నిర్మించాను. దాంతో కొత్తవాళ్లతో సినిమాలు తీసే జర్నీ మొదలైంది. రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ సినిమా సమయంలో అప్పటికి టీజర్లు, ట్రైలర్లు ఏమీ లేవు. సినిమా చూడమన్నారు. చూశాను. నాకు చాలా నచ్చింది. దాంతో ఆ సినిమాలో నేను భాగస్వామి అయ్యాను. ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది. ‘ఇట్లు అర్జున’ సినిమాకి మహేష్, అనీష్, వెంకీ వచ్చి గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ చెప్పమన్నారు. నాకు నచ్చడంతో వాయిస్ ఓవర్ చెప్పాను. 
 
నాకు అనీష్‌తో పరిచయం ఉంది. తన తొలి సినిమాకే మూగవాడి క్యారెక్టర్ చేయడం నిజంగా చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ కథ గురించి అడిగాను. కథ చెప్పారు. అప్పటికీ తొలి సినిమాకి ఎందుకు ఇంత పెద్ద ఛాలెంజ్ అని అడిగాను. వాళ్లు కథ మీద నమ్మకంతో సినిమాను అద్భుతంగా పూర్తి చేశారు. సినిమా మొత్తం చూశాను. నాకు చాలా నచ్చింది. బ్రిలియంట్ స్క్రీన్‌ప్లే. అనీష్ పెర్ఫార్మెన్స్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. చాలా అద్భుతంగా నటించాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా ఉంది. మంచి టాలెంటెడ్ టీమ్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన తర్వాతే డీఓపీ రాజాను నా ‘కింగ్ 100’ సినిమాకి పెట్టుకున్నాను. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా అంతా ట్విస్టులు, టర్న్స్‌తో నడుస్తూ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. ఈ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఉంది.
 
హీరో అనీష్ మాట్లాడుతూ,  నాగార్జున గారు మా సినిమాను ప్రజెంట్ చేయడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. మాకు చాలా గర్వంగా ఉంది. నాగార్జున గారు ఈ సినిమా చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పడం మాకు మరింత బలాన్ని ఇచ్చింది.
 
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Devika Bhat: రియాలిటీ ప్రేమలో మునిగిపోయిన కిరణ్ అబ్బవరం, దేవికా భట్