1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. I have faced ups and downs. I am constantly striving for good films like this: Kiran Abbavaram

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Sri Gouri Priya, Kiran Abbavaram, SKN, Sai Rajesh, Ravi Namburi  etc.
Sri Gouri Priya, Kiran Abbavaram, SKN, Sai Rajesh, Ravi Namburi etc.
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ జులై 24న విడుదలకాబోతోంది. ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందింది. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు వేడుకలు సందడిగా జరిపారు.
 
స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ, మా మూవీ చూస్తున్నప్పుడు సెకండాఫ్ లో కిరణ్ గారి పర్ ఫార్మెన్స్ అద్భుతంగా అనిపించింది. ఆయనకు ఈ సినిమాతో చాలా మంచి పేరొస్తుంది. నేను రాసిన కథలన్నీ డైరెక్ట్ చేయలేను.  బేబి హిందీ వెర్షన్ పనుల్లో ఉన్నాను. అందుకే నా స్నేహితుడు రవికి దర్శకత్వ బాధ్యతలు ఇచ్చాను. బేబి మూవీ టైమ్ నుంచి క్రియేటివ్ గా మా ఇద్దరి వేవ్ లెంగ్త్స్ కుదిరాయి. చెన్నై నగరానికి ఈ కథకు సంబంధం ఉంది. అందుకే టైటిల్ చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాం. బేబి సినిమాకు కావాల్సినంత సమయం ఉండేది. విజయ్ బుల్గానిన్ తో ఎక్కువ రోజులు కూర్చుని మంచి ట్యూన్స్ చేయించుకున్నాం. ఇప్పుడు అంత టైమ్ లేదు. తక్కువ టైమ్ లో క్వాలిటీ మ్యూజిక్ మణిగారు ఇస్తారు. అందుకే ఆయనను ఎంపిక చేసుకున్నాం. అన్నారు.
 
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ,  నా ఫ్రెండ్ ధీరజ్ మా మూవీకి కావాల్సిన బిజినెస్ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాడు. మా అందరి కెరీర్స్ లో హయ్యెస్ట్ థియేటర్స్ లో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ కాబోతోంది. రవి నంబూరి నా బ్రదర్. పదేళ్లుగా మాతో జర్నీ చేస్తున్నాడు. ఈ సినిమాను అతను అనుభవజ్ఞుడైన దర్శకుడిలా రూపొందించాడు. బేబి సినిమాతో చెన్నై లవ్ స్టోరీని పోల్చడం వల్ల అదనపు ఒత్తిడి మాపై ఏమీ పెరగడం లేదు. బేబి, చెన్నై లవ్ స్టోరీ రెండు భిన్నమైన కథలు. బేబి లాగే ఈ సినిమా కూడా స్ట్రైకింగ్ గా ఉంటుంది. ఈ జానర్ సినిమాలు నచ్చేవారిని చెన్నై లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. జననాయగణ్ సినిమాను దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. మా సినిమాను మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తోంది. దిల్ రాజు వర్సెస్ మైత్రీ అనేది ఏం ఉండదు. ఇద్దరూ మాకు మంచి థియేటర్స్ ఇస్తారని నమ్ముతున్నాం అన్నారు.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,  ఈ సినిమా నాకొక మెమొరబుల్ ఫిలిం. నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కొన్నేళ్ల తర్వాత నేను నటించిన చిత్రాల్లో ఏదైనా మళ్లీ చూడాలనుకుంటే ఈ సినిమా చూస్తాను. ఈ సినిమా విజయంపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. మీకు మా మూవీ నచ్చాలి. మా ప్రొడ్యూసర్స్ కు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. వేరే సినిమాల పోటీ ఉన్నా మేము ఈ నెల 24నే రిలీజ్ కు వస్తున్నాం. అందులో సందేహం లేదు. మా మూవీ కంటెంట్ మీద టీమ్ అంతా నమ్మకంతో ఉన్నాం. కంటెంట్ బాగున్న మూవీనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. సినిమా మీద ప్రేమతోనే నిర్మాత, దర్శకుడిగా మారాను. ఈ ఐదారేళ్లలో మీ దగ్గర నుంచి ఎంతో ప్రేమను సంపాదించుకున్నా. ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు చూశాను. మంచి సినిమాలు చేసి మీ ఆదరణ పొందాలనే నిత్యం ప్రయత్నిస్తున్నాను. ఈ చిత్రంలో ప్యూర్ లవ్ చూస్తారు. సినిమా మొత్తం నేను హీరోయిన్ ను అండి, మీరు అనే పిలుస్తాను. అంత గౌరవిస్తాను. డైలాగ్స్,  స్టోరీలోని బ్లాక్స్ మాస్ కే ఎక్కువ కనెక్ట్ అవుతాయి. అన్నారు.
 
నటి సిరి హన్మంతు మాట్లాడుతూ, ఇలాంటి మంచి మూవీలో భాగమయ్యే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ, . మా మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఏడాది అవుతోంది. ఇప్పటిదాకా మీరు ఆ గ్లింప్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో వదలనే సాంగ్ లీడ్ సీన్ చాలా బాగుంటుంది. అలాగే సెకండాఫ్ లో కొన్ని సీన్స్ మెమొరబుల్ గా ఉంటాయి. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ లో అనేక లేయర్స్ ఉంటాయి. మీరు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన నాలుగు పాటలు చూస్తే నాలుగు పాటల్లో ఒక్కోలా కనిపిస్తా. మీరు స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో మా సినిమాలో చూస్తారు. అన్నారు.
 
కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - ప్రేమ అనే పదం ఒక్కో టైమ్ లో ఒక్కోలా వినిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు ప్రేమ అంటే చెన్నై లవ్ స్టోరీనే. మరో నెల రోజుల వరకు ఈ సినిమానే నా ప్రేమ. అన్నారు
 
డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ - మా సినిమాలో నివి, స్టీవెన్ శంకర్ క్యారెక్టర్స్ మధ్య అందమైన సంభాషణలు ఉంటాయి. ఈ రెండు పాత్రలకు టైమ్ తీసుకుని మంచి డైలాగ్స్ రాశాం. ఆ స్వేచ్ఛను మా ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. స్టీవెన్, విని పాత్రలు ఒక్కసారి మనకు పరిచయమయ్యాక వారి పాత్ర స్వభావాల నుంచే మాటలు వచ్చేశాయి. నివి, స్టీవెన్ రెండు చాలా బలమైన పాత్రలు. స్టీవెన్ పాత్రను నేను బాగా తీర్చిదిద్దానని పేరొస్తే అది సాయి రాజేష్ గారి మీద నాకున్న ప్రేమకు నిదర్శనం. సాయి రాజేష్ గారు ఈ కథ చెప్పినప్పుడు చెన్నై బ్యాక్ డ్రాప్ అయితే కొత్తగా ఉంటుందని అన్నారు. చెన్నై అయితే ఒక వైబ్ ఉంటుంది అనిపించింది. అన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్