Sri Chidambaram : ఇగోస్టులందరితో ఎలా పనిచేయాలో నేర్చుకున్నా : వినయ్ రత్నం
Sri Chidambaram garu, director Vinay Ratnam
షార్ట్ ఫిలింస్ లు చేసి ఎడిటింగ్ కూడా తనే చేసుకున్న వినయ్ రత్నం చూడ్డానికి కుర్రాడిలా కనిపించినా వెండితెరపై దర్శకుడిగా మారారు. చిత్రం పేరు శ్రీ చిదంబరం గారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట కొత్త జంటను పరిచయం చేస్తున్న ఈ చిత్రాన్ని గోపాల క్రిష్టారెడ్డి నిర్మించారు. ఇటీవలే సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి గారు ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే ఓ పాట బ్యూటిఫుల్ పాటను విడుదల చేశారు.
సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి అభినందనలతో.. ఆయన సినిమాకు బెస్ట్ విషెస్ చెబుతూ పాటను విడుదల చేశారు ఇదిలా వుండగా సినిమా ఫిబ్రవరి 6వ తేదీన విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు వినయ్ రత్నం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ః
ఈ సినిమా మలయాళ చిత్రం గులాబ్ జామ్ కు పోలికలు కనిపిస్తున్నాయి?
నేను ఈ సినిమా చేయడానికి ముందే కథ విన్న తర్వాత మా కోడైరెోక్టర్ ఒకతను గులాబ్ జామ్ గురించి చెప్పాడు. ఆ సినిమాను చూశాను. నిర్మాతలు కూడా చూశారు. అందులో హీరోయిన్ కు మెల్ల కన్ను వుంటుంది. చిదంబరం సినిమాలో హీరోకు మెల్ల కన్ను వుంటుంది. అలా సినిమా అంతా మెయిన్ టేన్ చేయడం చాలా కష్టమైన పని. దానికి హీరో బాగా చేయగలిగాడు. అయితే మలయాళ కథకు మా కథకు చాలా వ్యత్యాసం వుంది. పోలిక అస్సలు లేదు.
టైటిల్ చిదంబరం పెట్టడంతో పరబాషా చిత్రంగా అనిపిస్తుంది?
అలా లేదు. మేముండే కోెనసీమ ప్రాంతంలో మెల్లకన్ను వున్న వ్యక్తిని చిదంబరం అంటూ పిలుచేవారు. అసలు పేరు తోకాకుడా అలా పిలవడంతో తన పేరును మరిచిపోయిన వ్యక్తుల్ని చూశారు. మన సినిమాల్లో కళ్ళు చిదంబరం గురించి తెలిసే వుంటుంది. అందుకే ఆ పేరు కూడా క్యాచీగా వుంటుందని పెట్టాం.
శ్రీ చిదంబరం గారు అనే టైటిల్ మార్చడానికి కారణం?
ఒట్టి చిదంబరం కన్నా వ్యక్తికి గౌరవం ఇవ్వాలనే శ్రీ అని పెట్టాం. చిరంజీవిగారి మన శంకరవర ప్రసాద్ గారు సినిమా టైటిల్ చూశాక మేమూ గారు అని తగిలించాం. అలా శ్రీ చిదంబరం గారు అని ఫైనల్ టైటిల్ పెట్టాం.
ఫార్ట్ ఫిలింస్ చేయడం మీ చేతుల్లో పని. ఏదైనా షూట్ చేయవచ్చు? కానీ సినిమా అంటే అందరికీతోపని గదా ఎలా మేనేజ్ చేశారు?
నిజమే షార్ట్ ఫిలించేస్తే అన్నీ నేనే చూసుకునేవాడిని. కానీ సినిమాకు అలాకాదు. ఇక్కడ ఎంతో మంది పనిచేస్తారు. కొందరు ఇగోష్టులు కూడా వుంటారు. వారందరినీ సమన్వయం చేయడం అనేది ఓపిగ్గా నేర్చుకున్నా.
అసలు కతోలని కోర్ పాయింట్ ఏమిటి?
చాలా మంది తమనుతాము తక్కువ అంచనా వేసుకుంటారు. అద్దంలో మన మొహం చూసుకుని మనం అందంగా వున్నామని ఫీల్ తోవుండాలి. వేరే వారితో పోల్చుకోకూడదు. బయటకు రాకుండా ఇంటిలో గిరి కూర్చుని సమాజం గురించి బయపడడం కరెక్ట్ కాదని ఈ సినిమా ద్వారా చెప్పాను. అదే కోర్ పాయింట్.