Tammareddy: ఇండస్ట్రీ లో మనుగడ లేదు అనుకున్న టైంలో వదలా చిత్రం చేశా : తమ్మారెడ్డి
వెర్సటైల్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రలో ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'. SVCLLP నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో చరిత చిత్ర బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్లింప్స్ నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి తన అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు. గతంలో నేను చెప్పిన మాటలు వాపసు తీసుకుంటున్నానన్నారు.
ఆయన మాట్లాడుతూ, సినిమా అంటేనే భయపడే రోజుల్లో నా దగ్గరకు కిషోర్ ద్వారా ఈ సినిమా వచ్చింది. ఈ పరిస్థితుల్లో అవసరమా? అన్నాను. ఇద్దరం జగపతిబాబు దగ్గరకు వెళ్ళాం. ఆయన కూడా నేను చెప్పిందే చెప్పారు. కథ నచ్చడంతో అంగీకరించారు. అక్కడ నుంచి ప్రయాణం సాగింది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటని నన్ను ఇండస్ట్రీలో చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు ఎవరూ సరిగ్గా పనిచేయడంలేదని చెప్పేవాడిని. అలాంటి టైంలో ఇప్పుడు ఇమడలేమనుకున్న తరుణంలో సినిమా చేశాం. కానీ ఆరోజు ఎలా వుందో. ఇప్పుడు అలానే వుంది. వదలా అనే టైటిల్ ఎందుకు పెట్టామో కానీ, 24 క్రాఫ్ట్ ల వారు 24 గంటలూ పనిచేయడం ఆశ్చర్యం కలిగించింది.
ఈమధ్య టీవీల్లో చెబుతుండేవాడిని. ఇండస్ట్రీలో ఎవరూ సరిగ్గా పనిచేయడంలేదనేవాడిని. కానీ ఈ సినిమా చేశాక అందరూ కష్టపడి పనిచేస్తున్నారని గ్రహించాను. సునీల్ నారంగ్ సమర్పణలో ఈ సినిమా చేశాను. నా జీవితాన్ని ఇద్దరు నాయుడులు కిషోర్ నాయుడు, ఛోటా కె.నాయుడు మార్చారు. మా చరిత చిత్ర బేనర్ లో జగపతిబాబు గారు ఫస్ట్ టైం చేశారు. ఆయనే అన్నీ అయి పనిచేశాడు. ఇన్ వాల్వ్ మెంట్ చేశారు.
నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళయింది. ఇన్నేళ్ళుగా హిట్ ప్లాప్ తో పనిలేకుండా మీడియా సపోర్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.