1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. I made the movie Peddi with a fierce determination to score a hit, and the audience blessed it: Ram Charan.

Peddi Thanks meet: హిట్ అవ్వాలనే కసితో పెద్ది సినిమా చేశా, ప్రేక్షకులు దీవించారు : రామ్ చరణ్

Ramcharan and buchi babu sana
Ramcharan and buchi babu sana
పెద్ది సినిమా విడుదలై మంచి టాక్ తో రన్ అవుతుండడంతో నేడు హైదరాబాద్ లో థ్యాంక్స్ ప్రెస్ మీట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ,  నచ్చుతూ, ప్రేమిస్తూ పనిచేయడం నాకు ఇష్టం. తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం అర్థంకాలేదు. ఎవరూ నన్ను పుష్ చేసి ఇలా చేయి అనలేదు. నాకు పెద్ది సినిమా చేయడం చాలా సంత్రుప్తిగా వుంది. అందుకే థ్యాంక్స్ చెబుదామనే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాం.
 
 
యు.కె. యు.ఎస్. దుబాయ్ అన్ని చోట్ల కలెక్టన్లు పెరుగుతూ వున్నాయి. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ప్రసాద్ ఐమాక్స్ వెళ్ళాను. అక్కడ మాస్ థియేటర్ లో వున్న రెస్పాన్స్ వచ్చింది. మా టీమ్ కు బుజ్జిబాబుకు ధన్యవాదాలు. నా సినిమా కెరీర్ లో లైబ్రరీ వుంచుకునే సినిమా.
 
కథ విన్న రోజే బుజ్జిబాబును హగ్ చేసుకున్నా. కానీ చాలా పెద్ద సినిమా. అందుకే కష్టపడి పనిచేశాను. హిట్ అవ్వాలనే కసితో చేశాను. ఇండియాతోపాటు ఇతర చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. పిల్లలు, పెద్దలు ఈ సినిమాను థియేటర్ కు వచ్చి చూసేలా చేసింది.
 
ఇలాంటి సినిమా గురించి అందరికీ చేరవేసేది మీడియానే. మంచి రిపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. జగపతిబాబు గారు పూర్తి రోల్ ఇన్ స్పైరింగ్ గా వుంది. మిగిలిన పాత్రలు కూడా బాగా చేశారు. సెకండాఫ్ లో మేమంతో కష్టపడి చేశాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా రెహమాన్ అద్భుతంగా తీసుకెళ్ళారు. నిర్మాత సతీష్ గారికి భారీ చిత్రంగా తీశారు. కష్టమనేది తెలీకుండా 185 డేస్ షూటింగ్ లో 165 డేస్ నిర్మాత మా వెంటే వున్నారు. 
 
ఇక అనంత శ్రీరామ్ పాటలు చాలా స్పూర్తిగా వున్నాయి. ఎప్పుడైనా డల్ గా అనిపించినా మీ మాటలు వుంటే ఎనర్జీ వస్తుంది. 
About Writer
దేవీ
తర్వాతి కథనం
Trigun : జంగా గా త్రిగుణ్ మోషన్ పోస్టర్ విడుదల