Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్
Mrunal Thakur
అడివి శేష్ యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్'తో ఆమె నటించింది.షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాటీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
- సరస్వతి క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నా కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్ రోల్. ఇప్పటివరకు నేను చేయని కొత్త జానర్ ఇది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను.
-నాకు ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్ చేయాలని ఉంటుంది. అలాగే నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన సినిమా ఇది. -నాకు కొత్త ఎమోషన్స్ ఉన్న సినిమాలు చేయాలనిపిస్తుంది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్లు చేయాలనే తపన ఉంటుంది. డెకాయిట్ కూడా అలాంటి కొత్త జానర్ సినిమా.
-కథ విన్నప్పుడు సరస్వతి, హరి ఎందుకు డెకాయిట్స్‌గా మారారో అనేది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ.
-ఈ సినిమాలో “రూబారు” పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తాయి. పాటలన్నీ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి.
-సీతారామంలో మీ క్యారెక్టర్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు డెకాయిట్ సినిమా ఎలాంటి అనుభవం ఇస్తుంది?
-ఈ సినిమాని శేష్ కోసం థియేటర్‌కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో అడివి శేష్ చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ చేశారు. ఇది ఆయన బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా ఉంటుంది. శేష్ గారు, ప్రకాష్ రాజ్ గారితో కలిసి పనిచేయడం మంచి అనుభవం.
- సీత క్యారెక్టర్‌కు సరస్వతి క్యారెక్టర్ .. ఈ రెండు పూర్తిగా భిన్నమైన పాత్రలు. సీత లాంటి పాత్రలో నన్ను ఇప్పటికే ఆడియన్స్ చూశారు. నన్ను కొత్తగా చూడాలనుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుంది.
-ఈ సినిమా రెండు భాషల్లో షూట్ చేశాం. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ అన్నీ స్ట్రైట్ తెలుగు సినిమాలు. కానీ ఇది రెండు భాషల్లో చేయడం నాకు మరింత ఛాలెంజింగ్‌గా అనిపించింది.
-అనురాగ్ గారు అద్భుతమైన డైరెక్టర్. యాక్టర్‌గా కూడా చాలా వెర్సటైల్. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మేమిద్దరం హిందీ నుంచి వచ్చాం. కలిసి తెలుగు డైలాగ్స్ నేర్చుకోవడం మంచి అనుభవం.
-శేష్ గారు స్వయంకృషితో ఎదిగిన స్టార్. అలాంటి సెల్ఫ్‌మేడ్ స్టార్‌తో పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. రైటింగ్, డైరెక్షన్.. అన్నిట్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చాలా హంబుల్‌గా ఉంటారు.
-సుప్రియ గారు వెరీ నైస్ ప్రొడ్యూసర్. ఒకసారి నేను షూటింగ్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ రావాలి. అప్పుడు నాకు జ్వరం. నా ఆరోగ్యం గురించి తెలుసుకుని షూటింగ్‌ను రెండు రోజులు హోల్డ్ చేశారు. నటీనటుల ఆరోగ్యాన్ని ఇంతగా చూసుకునే ప్రొడ్యూసర్‌ను నేను చూడలేదు.
-నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కార్ డ్రైవ్ చేసిన మొదటి అమ్మాయి నేనే. యాక్షన్ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అలాంటి యాక్షన్ చేసే అవకాశం దొరికింది.
-ఈ సినిమాకు వర్క్‌షాప్ కూడా చేశాం. కానీ ఆ విషయాలు ఇప్పుడు చెప్పలేను. ఎక్కువగా అవుట్‌డోర్‌లో షూట్ చేశాం. ముఖ్యంగా రోడ్లపై డ్రైవింగ్ సీక్వెన్స్‌లు చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. ఒక అంబులెన్స్ డ్రైవ్ చేయాల్సి వచ్చింది. దానికి హ్యాండ్ బ్రేక్ ఉండదు. చాలా రిస్కీ సన్నివేశాలు కూడా చేశాం.
- డైరెక్టర్ షానియల్ డియో ఫాంటాస్టిక్ డైరెక్టర్. ఈ సినిమా విజువల్‌గా అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్, ఎడిటర్, కెమెరామెన్ ముగ్గురి టీమ్‌వర్క్ చాలా గొప్పగా ఉంది. విజువల్స్ హాలీవుడ్ స్టైల్‌లో ఉంటాయి. అన్ని విభాగాల్లో అద్భుతమైన పని చేశారు.
-డెకాయిట్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. “కన్నేపెట్టరో” పాట నాకు చాలా ఇష్టం. 'డెకాయిట్' ఖచ్చితంగా అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది.
