మంగళవారం, 9 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 నవంబరు 2025 (18:44 IST)

అప్పట్లో తెలియక బెట్టింగ్ యాప్‌ని గేమింగ్ యాప్ అనుకుని ప్రమోట్ చేసా: ప్రకాష్ రాజ్ (video)

Prakash Raj
సినీ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం నాడు తనపై వున్న బెట్టింగ్ యాప్ కేసు గురించి వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్ సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. 2016లో కొత్తగా వచ్చిన బెట్టింగ్ యాప్‌ను గేమింగ్ యాప్ అని అనుకుని ప్రమోట్ చేసాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది కనుక నేను యువతకు చెప్పేది ఏమిటంటే... బెట్టింగ్ యాప్ మాయలోపడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. వాటి జోలికి వెళ్లవద్దంటూ ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు.
 
అంతకుముందు అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారనే ఆరోపణలతో కూడిన కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట కూడా నటుడు ప్రకాష్ రాజ్‌ హాజరై వివరణ ఇచ్చుకున్నారు.