ఎంజీఆర్ పైన నేను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా, క్షమించండి: రాజేంద్రప్రసాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఇటీవలి కాలంలో పుసుక్కున నోరు జారడం జరుగుతోంది. మళ్లీ మరోసారి ఇలాగే నోరు జారారు. తమిళనాడు లెజండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గురించి రాజేంద్రప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. అలనాటి నటుడు కాంతారావును చూస్తే ఎంజీఆర్ విపరీతంగా భయపడేవారనీ అంటూ అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగిస్తూ చెప్పారు. దీనిపై కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమయ్యింది.
రాజేంద్రప్రసాద్ గారు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణలు చెప్పాలంటూ నటుడు విశాల్ డిమాండ్ చేసారు. తను చేసి వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన... నేను మాట్లాడింది తప్పు. అలా అనకుండా వుండాల్సింది. ఏదో ఫ్లోలో పొరబాటున వ్యాఖ్యానించాను. దయచేసి క్షమించండి. ఎంజీఆర్ గారు లెజండరీ, ఆయనను విమర్శించేటంతటి వాడినా నేను అంటూ చెప్పుకొచ్చారు.
