సంబంధిత వార్తలు
- Niharika: విజయ్ దేవరకొండ తో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన నీహారిక కొణిదెల
- Niharika: ముకుంద తరువాత బాబాయ్ పవన్ కళ్యాణ్ బరి చిత్రం కోసం వచ్చారు
- Pawan Kalyan: వరుణ్ తేజ్ కు క్లాప్ కొట్టి బరిలోకి దింపిన పవన్ కళ్యాణ్
- Niharika: సమ్మర్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ మూవీ రాకాస : నిహారిక కొణిదెల
- చంద్రబాబుకు భయపడొద్దు... జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత : వైఎస్ జగన్
సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం : నిహారిక కొణిదెల
Niharika Konidela, Sangeeth Shobhan, Nayan Sarika, Anudeep and others
ఈ కార్యక్రమంలో..నిహారిక కొణిదెల మాట్లాడుతూ, యూట్యూబ్‌లో మ్యాడ్ హౌస్ అని ఓ సిరీస్ చేశాం. ఆ టైంలో మానస గారి డైలాగ్స్ మొదటగా విన్నాను. ఆ తరువాత మానస గారిని చూశాను. ఆమె తక్కువ మాట్లాడుతుంది. కానీ చాలా ఆలోచిస్తుంటుంది. 24 గంటలు సినిమా గురించి, కథ గురించే ఆలోచిస్తుంటుంది. మానస ఇంకా ఇంకా చాలా ఎత్తుకు వెళ్తుంది. మానస గారు, మహేష్ గారు, యదు వంశీ గారి వంటి వారిని ఇంట్రడ్యూస్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. కమిటీ కుర్రోళ్లు చేస్తున్నప్పుడు 11, 15 మంది కొత్త వాళ్లతో చేయడం ఎందుకు అన్నారు?.. రాకాస టైంలో ఇలాంటివి ఎందుకు కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అని అన్నారు..
బరి చేస్తుంటే.. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎందుకు? అని అంటున్నారు.. ఇలా అనే వాళ్లు అంటూనే ఉంటారు.. నాకు నచ్చింది నేను చేస్తూనే ఉంటాను. నేను నా ప్రతీ సినిమాతో కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉంటాను. నాకు కొణిదెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ రెండూ సమానమే. నా మీద నమ్మకం పెట్టుకుని, నాకు ఫ్రీడం ఇచ్చిన నా తల్లిదండ్రులకు థాంక్స్. రమేష్ గారు మొదటి నుంచి మాకెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అనుదీప్ గారికి అద్భుతమైన మ్యూజిక్ టాలెంట్ ఉంది. రాజు గారి విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. విజయ్ మాస్టర్ గారిని సెట్లో చూస్తే మా నాన్న గారిని చూసినట్టే అనిపిస్తుంది. నయన్‌లో ఓ ప్రత్యేకత ఉంది. ఆమె చాలా మంచి వ్యక్తి. సంగీత్ షైనింగ్ స్టార్. రాకాస చిత్ర విజయంలో సంగీత్‌కి సింహభాగం దక్కుతుంది. మేం నిజాయితీతో వంద శాతం కష్టపడి ఓ మంచి సినిమాని చేశాం. మా పింక్ ఎలిఫెంట్‌లో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం. ఏప్రిల్ 3న రాబోతోన్న రాకాస ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది అని అన్నారు.
సంగీత్ శోభన్ మాట్లాడుతూ, మహేష్ గారి వల్లే నాకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వచ్చింది. దర్శకుడిగా మహేష్ ఇట్లు అర్జునతో బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నారు. చలికాలంలో రాత్రిపూట ఎక్కువగా షూటింగ్ చేశాం. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కి థాంక్స్. నయన్‌కి మంచి టాలెంట్ ఉంది. ఆమెతో పని చేయడం ఆనందంగా ఉంది. గెటప్ శ్రీను గారు చాలా మంచి వ్యక్తి. నిహారిక గారు చాలా సున్నితమైన వ్యక్తి. ఆమెకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి మానస గారితో నాకు మంచి బంధం ఉంది. జనాలు సినిమాని చూసి వదిలేయకూడదు, ఇంటికి తీసుకెళ్లాలి, గుర్తు పెట్టుకోవాలి, వాళ్లు పెట్టే డబ్బులకి సరిపడేలా న్యాయం చేయాలని మానస గారు తపన పడుతుంటారు. బైకర్ కూడా ఏప్రిల్ 3న రాబోతోంది. రెండు సినిమాల్ని ఆడియెన్స్ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నయన్ సారిక మాట్లాడుతూ, నిహారిక గారితో పని చేస్తే లక్ కలిసి వస్తుంది. రాకాసతో మళ్లీ ఆమెతో పని చేయడం ఆనందంగా ఉంది. మా అందరినీ బాగా చూసుకున్న రమేష్ గారికి థాంక్స్. మానస శర్మ గారికి సినిమా పట్ల చాలా ఫోకస్, క్లారిటీ ఉంది. సెట్‌లో గెటప్ శ్రీను గారు అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. సంగీత్‌తో ఉన్న ర్యాప్‌తో ఇంకా ఏ కో యాక్టర్‌తో నాకు లేదు. రాకాసని ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఏప్రిల్ 3న మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు.
దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ, నిహారిక గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. రాజు గారికి పని పట్ల ఎంతో ఉత్సాహం ఉంటుంది. అనుదీప్ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నా రైటింగ్‌లో భాగస్వామి అయిన మహేష్ గారికి థాంక్స్. అన్వర్ గారు నాకెంతో సపోర్ట్ చేశారు. నయన్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన గెటప్ శ్రీను గారు, బ్రహ్మాజీ గారు, తనికెళ్ల భరణి గారికి థాంక్స్. సంగీత్ శోభన్ నా బలం. ఏప్రిల్ 3న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి అని అన్నారు.
యదు వంశీ మాట్లాడుతూ, నిహారిక గారి వల్లే రాకాస ఈ స్థాయికి వచ్చింది. అనుదీప్ మరింత పెద్ద స్థాయికి వెళ్తాడు. అన్వర్ అహర్నిశలు సినిమా కోసం కష్టపడుతుంటారు. ఈ చిత్రానికి విజయ్ మాస్టర్ అతి పెద్ద బలం. రాజు విజువల్స్ గురించి రమేష్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. సంగీత్‌కి సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. నయన్ గారు స్క్రీన్ పై అందంగా కనిపిస్తున్నారు. ఏప్రిల్ 3న రాబోతోన్న ఈ చిత్రం అందరినీ నవ్వించబోతోంది అని అన్నారు.
