గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 9 డిశెంబరు 2025 (17:41 IST)

Eesha Rebba: మా గర్ల్స్ గ్యాంగ్ లో నేను కూడా అలా ఉన్నాను: ఈషా రెబ్బా

Eesha Rebba
Eesha Rebba
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ "త్రీ రోజెస్". ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు ఇంటర్వ్యూలో "త్రీ రోజెస్" సీజన్ 2 హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఈషా రెబ్బా.
 
- "త్రీ రోజెస్" సీజన్ 2లో నేను కంటిన్యూ కావడం హ్యాపీగా ఉంది. సీజన్ 1లో ఫీమేల్ క్యారెక్టర్స్ కు వేర్వేరు సీన్స్ ఉంటాయి. ఈ సీజన్ 2లో ఆ క్యారెక్టర్స్ అన్నింటికి కలిపి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. వెకేషన్ కు వెళ్లే సన్నివేశాలు సీన్స్ చేశాం. నేను రాశీ కుషిత మూడు కీ రోల్స్ చేశాం.
 
- రాశీ ఫైర్ బ్రాండ్ లా ఉంటుంది. కుషిత చిన్న పిల్లలా అల్లరి చేసేది. వీళ్లిద్దరితో కలిసి నటించడం ఎంజాయ్ చేశాను. ఈ సిరీస్ లో గ్లామర్ డోస్ పెంచలేదు. యూత్ ఫ్యామిలీ అంతా కలిసి సిరీస్ చూడొచ్చు. "త్రీ రోజెస్" సీజన్ 2లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల నిడివితో సాగుతుంది. "త్రీ రోజెస్" సీజన్ 3కి లీడ్ ఇస్తూ సీజన్ 2 కంప్లీట్ అవుతుంది.
 
- హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉండే మూవీస్ గతంలో చాలా తక్కువగా వచ్చేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ఫీమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ వస్తే నన్ను నేను అందులో రిలేట్ చేసుకోగలిగితే నటించేందుకు ఒప్పుకుంటా. నేను లాక్ డౌన్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. యాక్షన్ మూవీస్ లో అవకాశం వస్తే నటిస్తా.
 
- గర్ల్స్ అంతా కలిసి ఒక దగ్గర రెంట్ కు ఉండటం, వాళ్లు కలిసి సరదాగా కుకింగ్, గాసిప్స్ చెప్పుకోవడం, లైఫ్ లీడ్ చేయడం అనేది ఈ సీజన్ 2లో నేను పర్సనల్ గా బాగా కనెక్ట్ అయిన పాయింట్. గతంలో మా గర్ల్స్ గ్యాంగ్ లో నేను కూడా అలా ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి: సినిమా సంక్రాంతి అయ్యాక జనవరి 23న రిలీజ్ చేస్తున్నారు. సినిమా అప్పటికే కంప్లీట్ అయి ఉన్నా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమిళంలో ఒక మూవీ చేస్తున్నా.  మా మదర్ వాళ్లది రాజమండ్రి, మా నాన్నది వరంగల్ కాబట్టి సంక్రాంతికి ఏపీకి వెళ్తా, అలాగే ఇక్కడ పండుగలకు వరంగల్ వెళ్తుంటా.