సంబంధిత వార్తలు
- Ntr: అఖిల్ అక్కినేని 'లనిన్ ట్రైలర్‌కు టాలీవుడ్ తారల మద్దతు
- Akhil: అఖిల్ అక్కినేని రగ్గడ్ లెనిన్ ట్రైలర్ 10 మిలియన్ల దాటి ఉత్సాహానిచ్చింది
- హైదరాబాద్ నా రెండవ ఇల్లు.. రామ్ పోతినేనితో ప్రేమ వల్లే భాగ్య శ్రీ అలా చెప్పిందా?
- సోల్ ఆఫ్ లెనిన్‌కి థియేటర్లలో అద్భుతమైన స్పందన- జూన్ 26న మనోడు వస్తున్నాడు
- Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం
Akhil: లెనిన్ కథకు అఖిల్ సూట్ అవుతాడా? అని భయపడ్డాను, కానీ చూశాక హిట్ నమ్మకం కలిగింది : నాగార్జున
Nagarjuna, Akhil Akkineni, Bhagyashri Borse, Bramhaji, Naga Vamsi
నాగార్జున మాట్లాడుతూ, నందు ముందుగా శ్రీరామపురంలో జరిగే కథ అని చెప్పారు. నాన్న గారు శ్రీరామపురంలో అనే ఊర్లోనే పుట్టారు. నందు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ప్రతీ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టుల్ని ఎవ్వరూ ఊహించలేరు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి.. యుద్దాలు జరిగాయి.. లెనిన్లోనూ ఓ ప్రేమ కథ ఉంది. భారతి (భాగ్యశ్రీ బోర్సె) కోసం ఎన్ని యుద్ధాలైన చేయొచ్చు. భారతికి ఈ సినిమాకి హార్ట్ బీట్‌లాంటిది. శివాజీ, బ్రహ్మాజీ ఈ చిత్రంలో పాత్రలను పోషించడం ఆనందంగా ఉంది. సునీల్‌తో కలిసి ఎన్నో సినిమాలు చేశాను. లెనిన్ మీద ప్రేమతో వీరంతా చాలా కష్టపడ్డారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవీన్ ఎడిటింగ్, బ్రిట్టో కెమెరావర్క్ అద్భుతంగా ఉంటుంది. నాగవంశీ కి మాస్ పల్స్ గురించి తెలుసు. అందుకే తను ఈ మూవీని ఏపీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. లెనిన్ ఈ సీమ కథ, సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ, సీమలో జరుగుతున్న మహా భారతం. అఖిల్ ఇలాంటి కథకు సూట్ అవుతాడా? అని మొదట్లో చాలా భయపడ్డాను. కానీ సినిమా చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ కనిపించలేదు.. లెనిన్ మాత్రమే కనిపించాడు. లెనిన్ ప్రేమను, పగను ప్రేమిస్తారు.. లెనిన్‌ను ఇంటికి తీసుకు వెళ్తారు. మనందరికీ ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి.. ఈ ప్రేక్షక దేవుళ్లు సాక్షిగా చెబుతున్నాను.. జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు అని అన్నారు.
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, మీ ఇంటిలో ఒకడిని అవ్వాలని ప్రయత్నం చేశాను. సీమ బిడ్డ నందు నాకు అద్భుతమైన కథ చెప్పారు. నా జర్నీ, నా పెయిన్ అంతా కూడా ఈ కథలోనే కనిపించింది. అందుకే నేను వెంటనే ఓకే చెప్పాను. వంశీ ఒక్కడే ఈ మూవీని చేయాలని అనుకున్నాడు. కానీ కథ విన్నాక ఇద్దరికీ ఓ పాజిటివ్ వైబ్ వచ్చి నాన్న గారికి చెప్పాం. అందరం కలిసి పని చేద్దామని నిర్ణయించుకున్నాం. లియోన్, నవీన్, తమన్ ఇలా అందరూ మా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. భారతిగా భాగ్యశ్రీ బోర్సె చాలా కష్టపడ్డారు. బ్రహ్మాజీ గారు, సునీల్ గారు, శివాజీ గారు ఇలా మేమంతా కలిసి ఓ కుటుంబంలా సినిమా కోసం కష్టపడ్డాం. నేను లెనిన్ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడను. జూలై 10న సినిమానే మాట్లాడుతుంది. ఆడియెన్స్ నుంచి రియాక్షన్స్ వచ్చిన తరువాతే నేను మూవీ గురించి మాట్లాడతాను అని అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ* .. లెనిన్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. నేనే అఖిల్‌ను ఎక్కువ ఇబ్బంది పెట్టాను. లెనిన్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్‌లు ఉంటాయి. అఖిల్ ఈ సారి ఏ ఒక్కరినీ కూడా నిరాశపర్చడు. ఇంటర్వెల్, చివరి 40 నిమిషాలు మాత్రం ఖంగుతినేలా ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్‌లా మాత్రం అస్సలు ఉండదు. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. భాగ్య శ్రీ గారు మాకెంతో సపోర్ట్ చేశారు. శివాజీ గారు, సునీల్ గారు అద్భుతంగా నటించారు. నేను, తమన్ కలిసి వచ్చిన ప్రతీ సారి బ్లాక్ బస్టర్ వస్తుంది. మా కాంబోలో అసలు అపజయం అన్నదే లేదు. నాగార్జున గారు.. మనం హిట్టు కొట్టిన తర్వాత మాట్లాడదాం అని అన్నారు.
