Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్
Thiruveer, S.P. Durga Naresh, K.M. Radhakrishna, Avasara srinivas
ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో పిల్ల ఎక్కడుంది సాంగ్ ని రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధకృష్ణ అద్భుతమైన మాస్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రామ్ మిర్యాల వోకల్స్ సాంగ్ ఎనర్జీని మరింత పెంచాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేకంగా పరామర్శ సభ ప్రెస్ మీట్ ని నిర్వహించారు..
హీరో తిరువీర్ మాట్లాడుతూ: పరామర్శ సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. గత సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇరుగుపొరుగు వారు, ఊర్లో వాళ్లు ఎన్నో విధాలుగా నన్ను విమర్శించారు. అందరూ “పాపం ప్రతాప్” అని మాత్రమే అన్నారు… కానీ నా సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్లు ఎవరూ లేరు. ఈ నెల 17వ తేదీన నా “బుజ్జమ్మ”తో మీ ముందుకు, మీ ఊర్లో థియేటర్లలో వస్తాను. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? అన్నది మీకు చూపిస్తాను. ఇప్పటివరకు “పాపం ప్రతాప్” అన్నవాళ్లతో “వీర ప్రతాప్” అనిపించుకుంటాను. ఏప్రిల్ 17న మీరు “వీర ప్రతాప్”ని చూస్తారు. డైరెక్టర్ నరేష్ ఈ కథ చెప్పిన దానికంటే అద్భుతంగా సినిమా తీశారు. అనుభవమున్న నిర్మాతలు, అలాగే ఈటీవీ విన్ టీమ్ మాకు అండగా ఉన్నారు. అందికే “ఫ్రీ వెడ్డింగ్” కంటే నాలుగు రెట్లు ఎక్కువ నమ్మకంతో ఉన్నాను అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ, చాలాసార్లు మగాళ్ల కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ నవ్వే ప్రతి ముఖం వెనుక ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధలను నవ్విస్తూ చూపించే చిత్రం “పాపం ప్రతాప్”. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఏప్రిల్ 17న థియేటర్లకు వచ్చి చూడండి. మీ టికెట్‌కు సరిపడా వినోదం మాత్రమే కాదు, రెట్టింపు ఎంటర్టైన్‌మెంట్ ఇస్తాం. సమస్యలను చెప్పే సినిమాలు చాలా ఉంటాయి. కానీ పాపం ప్రతాప్ లో పరిష్కారం కూడా ఉంది. ప్రతి మగాడి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సమస్య ఇది. ఆ సమస్యకు సమాధానం ఈ సినిమా ఇస్తుంది.
డైరెక్టర్ దుర్గా నరేష్ మాట్లాడుతూ, రాధాకృష్ణ గారి పాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాను. ఈ సినిమా కథ ఆయనకు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు. “ పిల్ల ఎక్కడ ఉంది” పాట కోసం దాదాపు రెండు నెలలు శ్రమించాం. ఫైనల్‌గా అద్భుతమైన ట్యూన్ వచ్చింది. ప్రతి విజువల్‌కు సరిపోయేలా సుద్దాల అశోక్ తేజ గారు సాహిత్యం అందించారు. రామ్ మిర్యాల అద్భుతంగా పాడారు. తిరువీర్ గారు మొదటి రోజు నుంచి ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రసాద్ గారి కామెడీ ప్రత్యేకంగా ఉంటుంది. నిర్మాత రాకేష్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. అందరికీ ధన్యవాదాలు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు ఒక మంచి, కొత్త రోల్ చేసే అవకాశం వచ్చింది. ఈ టీమ్‌తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
మ్యూజిక్ డైరెక్టర్ కె.ఎం. రాధాకృష్ణ మాట్లాడుతూ, దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ మంచి ప్రాజెక్ట్‌తో వచ్చాను. ఇది నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. డైరెక్టర్ నరేష్ ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. నాకు మళ్లీ మంచి పాటలు చేసే అవకాశం వచ్చింది. “ఆనంద్”, “గోదావరి”, “చందమామ” లాంటి ఫీల్ మళ్లీ ఈ పాటల్లో కనిపిస్తుంది.“ పిల్ల ఎక్కడ ఉంది” లాంటి మాస్ సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ సినిమాతో మళ్లీ ఒక మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ రుద్రదేవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రాధాకృష్ణ గారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్ ఈ సినిమాను ఎంతో శ్రద్ధతో తీశారు. పాటలు అద్భుతంగా వచ్చాయి. మీ అందరి సపోర్ట్ కావాలి.
